
వంట గ్యాస్ ధరల మార్పు విషయంలో చమరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. మార్చి 1 నుంచి ఎల్‌పీజీ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్‌లో ధరల పెంచాలా? వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్‌పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు భారత్‌లో ఎల్‌పీజీ ధరలు పెరగనున్నాయని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ధరల పెంపు భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చూడలిమరి చమురు కంపెనీలు రేపు వంట గ్యాస్ ధరలను పెంచుతాయా? లేదా? అనేది. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(చదవండి: అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?)