నేడు బ్యాంకుల్లో ఆధార్ నమోదు | Today, banks Aadhaar enrollment | Sakshi
Sakshi News home page

నేడు బ్యాంకుల్లో ఆధార్ నమోదు

Published Sun, Aug 11 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

నేడు బ్యాంకుల్లో ఆధార్ నమోదు

నేడు బ్యాంకుల్లో ఆధార్ నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఆధార్ (యూఐడీ) నంబరును బ్యాంకుల్లో నమోదు చేసుకోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆదివారం కూడా ఆయా బ్యాంకు శాఖల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ భరత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఆధార్ కార్డు వివరాలతో తమ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, బ్యాంకు ఖాతాలు లేని వినియోగదారులు సమీప బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరవవచ్చు. ఈనెల 31తో గడువు ముగుస్తున్నందున భారత ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల ఆధార్ నమోదు కోసం నగరంలోని అన్ని బ్యాంకుల శాఖలు ఆదివారం కూడా పనిచేయాలని ఆదేశించినట్లు ఎల్డీఎం తెలిపారు. వివరాలకు 9885634895 నంబర్లో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement