Govt Reduced to LPG Cylinder Weight: గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఇది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు అంశం కాదండోయ్. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎల్‌పీజీ సిలిండర్ బరువుగా ఉండటంతో వాటిని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి జరపాలని అనుకున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతకు ముందు, భారీ సిలిండర్ బరువు కారణంగా మహిళలకు కలిగే అసౌకర్యం గురించి ఒక సభ్యుడు ప్రస్తావించారు. "మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బందిపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. దాని బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నామని" కేంద్రమంత్రి తెలిపారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును ఐదు కిలోలకు తగ్గించడం లేదా మరేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు.
(చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు!)
Comments
Please login to add a commentAdd a comment