Gas prices
-
రోడ్లపై బీఆర్ఎస్ వంటావార్పు
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు జరిపారు. రోడ్లపై కట్టెల పొయ్యితో వంటావార్పు, సిలిండర్లకు మోదీ ఫొటోలు అతికించి ఊరేగించడం, హైవేలపై ధర్నాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. దేశ ప్రజలను పీడించే పార్టీగా బీజేపీని అభివర్ణించారు. కరీంనగర్లో తెలంగాణ చౌక్ వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రోడ్లపై కట్టెల పొయ్యిలపై వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన ఆందోళనలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నల్లదుస్తులు ధరించి పాల్గొన్నారు. హైదరాబాద్ మీర్‌పేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్‌లో పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డిలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
ఎల్పీజీ ధరలో నెంబర్–2, పాట్నా తర్వాత హైదరాబాద్ టాప్
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని బాదేస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే గృహోపయోగ సిలిండర్ ధర విషయంలో నగరం రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో కంటే హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ ధర అధికంగా ఉంది. విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరానికి ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం దృష్ట్యా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కుటుంబాలతో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. అదే స్థాయిలో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ అధికమైంది. మార్కెట్ ధర ఇలా... మెట్రో నగరాల మార్కెట్‌తో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో సిలిండర్ రీఫిల్ ధర మండిపోతోంది. చమురు సంస్థలు రాష్ట్రానికోవిధంగా రవాణా దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.52 అధికంగా ఉంది. డొమెస్టిక్ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. ఐదు శాతం పన్నుల మోత వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్‌కు రవాణా, పన్నులు మరింత భారంగా మారాయి. చమురు సంస్థలు రవాణా, జీఎస్టీ పన్నులు కలుపుకొని ప్రస్తుత మార్కెట్ ధర అనుసరించి హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ సరఫరాకు రూ.1,105 వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా సిలిండర్ ధర రూ.1052.38 ఉండగా దానిపై సీజీఎస్టీ 2.5 శాతం కింద రూ.26.31, ఎస్జీఎస్టీ 2.5 శాతం కింద రూ. 26.31 పన్నుల భారం పడుతోంది. రవాణా చార్జీలను బట్టి.. చమురు సంస్థలు గ్యాస్ రవాణా దూరాన్ని బట్టి సిలిండర్ ధర నిర్ణయిస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ఎల్పీజీ ధర ఆదిలాబాద్‌లో రూ. 25 అధికంగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం కనీసం రూ. 20 నుంచి రూ. 27 వరకు అధికంగా ధర పలుకుతోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ టాప్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కూడా మోత మోగిస్తోంది. ఢిల్లీ కంటే సుమారు రూ. 204 అధికంగా పలుకుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ రూ. 1973 ఉండగా, చెన్నైలో రూ. 1971, కోల్‌కతాలో రూ.1870 ఢిల్లీలో రూ. 1,769, ముంబయిలో రూ.1721 ప్రకారం ధర పలుకుతోంది. 28.21 లక్షలపైనే... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన చమురు సంస్థలకు సంబంధించి సుమారు 28.21 లక్షల గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
గ్యాస్ ధరలకు చెక్: కిరీట్ పారిఖ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారణంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) ఈ చర్యలు దేశీయ వినియోగదారులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని కమిటీ వ్యాఖ్యానించింది. అలాగే 2030 నాటికి భారతదేశ ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటాను ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుండి 15 శాతానికి పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దాని సిఫార్సులు సహాయపడతాయని కూడా నొక్కి చెప్పింది. అలాగే దేశీయంగా వినియోగించే సహజ వాయువులో దాదాపు 50 శాతం దిగుమతి చేసుకుంటున్నారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’.. సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్
మీర్‌పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిత్యం పెరిగిపోతోన్న గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆదివారం రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చీపుళ్లు తిరగేస్తారనే భయంతోనే తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభకు మహిళలను ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఒక్కో రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపా రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.2వేల పింఛను ఇస్తుంటే..మరి కేంద్రం గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభలో అమిత్‌షా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ మాట్లాడలేదని.. అసలు సభ ఎందుకు పెట్టినట్లని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణుల మహాధర్నా. (ఇన్సెట్లో) కట్టెలపొయ్యిపై వంట చేస్తున్న మంత్రి సబిత రానున్న రోజుల్లో మహిళల ఆగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని హెచ్చరించారు. హిందూ, ముస్లింల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజల్లోకి వస్తే గ్యాస్, ఇంధన ధరలు తగ్గించేంత వరకు తమ వద్దకు రావద్దని మహిళలే వారిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 111ను ఎత్తివేస్తామని బండి సంజయ్ చెప్పారని, దానిపై ఆయనకు అవగాహన లేదని, ఓ వైపు 111 జీవోను ఎత్తివేస్తేనే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్ని రూ.కోట్లు ఇచ్చామంటూ కిషన్‌రెడ్డి, అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తున్నామని చెబుతున్న వారు ఇవే పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?
ఇంధన ధరల పెంపుతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటికి తోడుగా నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి..! ఏప్రిల్ 1 నుంచి నేచురల్ గ్యాస్ ధరలు రెండింతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో భారత్‌ను ద్రవ్యోల్భణ భయాలు మరింత ఎక్కువయ్యేలా కన్పిస్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను నేచురల్ గ్యాస్ ధరలు ఒక్కో మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంఎంబీటీయూ) ధరను 6.1 డాలర్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం నేచురల్ గ్యాస్ ధర ఒక్కో ఎంఎంబీటీయూ 2.90 డాలర్లుగా ఉండేది. రిలయన్స్, ఓఎన్‌జీసీలకు బొనాంజా..! నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో రిలయన్స్, ఓఎన్జీసీ సంస్థలు భారీగా లాభపడనున్నాయి. కేజీ గ్యాస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఒక్కో ఎంఎంబీటీయూపై సుమారు 10 డాలర్లు లభించనుంది. దాంతో పాటుగా ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), లబ్ధి చేకూరనుంది. సామన్యులపై ప్రభావం ఎంతంటే..? 2021 జనవరి-డిసెంబర్ కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. కాగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. చదవండి: సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..! -
బేగంపేటలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
-
బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. చదవండి: అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్ చేయాలి. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చదవండి: Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. సీఎం జగన్ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. -
పెట్రో, గ్యాస్ ధరలను తగ్గించండి: సునీతారావు
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ధరలను తగ్గించాలని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడి డిసాజో పిలుపు మేరకు గురువారం గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడారు. పెట్రో ధరల పెంపు ప్రభావంతో అనేక నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో, డీజిల్ ధరల పెంపుపై సునీతారావు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసి స్తూ గాంధీభవన్ ఎదుట కట్టెల పొయ్యి మీద వంటావార్పు చేశారు. -
సహజవాయువు ధర పెంపు: వంటగ్యాస్ మంటలేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి సహజవాయువు ధరను పెంచేసింది. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సహజ వాయువు ధర 6శాతం పెరిగింది. దీంతో సహజవాయువు ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఈ చర్య మూలంగా సీఎన్జీ, పీఎన్జీ పైప్డ్ వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయని విశ్లేషకుల అంచనా. తాజా పెంపుతో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు చొప్పున పెరగనుంది. ధరలు పెంచకముందు ఇది 2.89 డాలర్లుగా ఉంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆరు నెలల పాటు అక్టోబర్ దాకా ఈ ధరలు అమల్లో ఉంటాయి. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. దేశీయ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ధర కూడా 3శాతం పెరగనుంది. అలాగే సీఎన్జీ, వంటగ్యాస్ లు ధరలు 50-55 పైసలు , స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు 35-40 పైసలు పెరగనున్నట్టు అంచనా. మరోవైపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లాంటి సంస్థలకు భారీగా లబ్ధి చేకూరనుంది. కాగా అమెరికా, రష్యా , కెనడా వంటి గ్యాస్ మిగులు దేశాలలోని సగటు రేట్లు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సహజ వాయువు ధరల సమీక్ష ఉంటుంది. -
25 డాలర్లకు తగ్గనున్న చమురు
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే మార్కెట్లో పేరుకుపోయిన చమురు, గ్యాస్ నిల్వల వినియోగం నెమ్మదిగా జరుగుతున్నందున .. రేట్లు మరికొన్నాళ్ల పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ వివరించింది. 2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది అమెరికా హెన్రీ హబ్ సహజ వాయువు (గ్యాస్) రేటు యూనిట్‌కు (ఎంబీటీయూ) సగటున 2.25 డాలర్లుగా ఉండొచ్చని, వచ్చే ఏడాది 2.50 డాలర్లకు, 2018లో 2.75 డాలర్లకు చేరొచ్చని మూడీస్ పేర్కొంది. ఇలా కాకుండా చమురు, గ్యాస్ రేట్లకు కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు తగ్గినా.. ఇరాన్ నుంచి పెరిగితే చమురు రేటు 25 డాలర్లకు, గ్యాస్ ధర యూనిట్‌కు 1.75 డాలర్లకు పడిపోవచ్చని వివరించింది. అమెరికా, చైనా, భారత్ సహా ప్రధాన వినియోగ దేశాల్లో డిమాండ్ కన్నా మించి ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా ఉంటోందని మూడీస్ పేర్కొంది. చమురు రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి దేశాల వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కనీసం 0.8% మేర మందగించవచ్చని, అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
ఆయిల్, గ్యాస్ పరిశ్రమకు గడ్డుకాలం!
మూడీస్ నివేదిక * 2016లో ఆయిల్, గ్యాస్ ధరలు బలహీనమేనని అంచనా... * పెట్టుబడులు 25 శాతం వరకూ పడిపోవచ్చని విశ్లేషణ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఈ సంవత్సరం కూడా బలహీనంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక మంగళవారం అభిప్రాయపడింది. అధిక సరఫరాలు దీనికి కారణమని తెలిపింది. ఆయా అంశాల నేపథ్యంలో గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, ఉత్పత్తులపై మూలధనం పెట్టుబడులు 20 నుంచి 25 శాతం శ్రేణిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయనీ విశ్లేషించింది. ‘చమురు, సహజ వాయువుల పరిశ్రమ: 2016లో మూలధన పెట్టుబడుల, సవాళ్లు’ అన్న శీర్షికన మూడీస్ తాజా నివేదిక విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... * మార్కెట్ షేర్ పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఒపెక్ (ఓపీఈసీ)-పలు ఒపెక్ యేతర ఉత్పత్తి దేశాలు భారీగా ఉత్పత్తులను కొనసాగించడం వల్ల సరఫరాలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేత కూడా సరఫరాల పెరుగుదలకు కారణం. * ఉత్పత్తుల తగ్గుదల, ధరలు తక్కువగా ఉండడం వంటి అంశాలు భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో చమురు వినియోగం పెరుగుదలకు దోహదపడుతుంది. * దిగువ స్థాయిలో ధరలు సంబంధిత కమోడిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు సవాలే. ఇక ఈ రంగం కూడా ‘డిఫాల్ట్స్’ సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. చమురు అన్వేషణ, ఉత్పత్తి (ఈ అండ్ పీ) కంపెనీల క్యాష్ ఫ్లోస్‌పై ఇప్పటికే దిగువస్థాయి ధరలు ప్రభావం చూపుతున్నాయి. డ్రిల్లింగ్, ఆయిల్‌ఫీల్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వంటి ఇతర ఇంధన కంపెనీలపై కూడా ప్రతికూల జాడలు కనిపిస్తున్నాయి. * ట్రెడెడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2016లో బ్యారల్‌కు సగటున 43 డాలర్లుగా ఉండవచ్చు. అటు తర్వాత ఏడాది 48 డాలర్లకు, 2018లో 53 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. * సవాళ్లను అధిగమించడానికి పరిశ్రమలో కొన్ని కంపెనీల కొనుగోళ్లు, విలీనాల అవకాశం ఉంది. ఫండింగ్ అవసరాలూ అదనపు ఇబ్బందులు సృష్టించవచ్చు. దీనితో దివాలా దిశగా కొన్ని కంపెనీలు నడిచే కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆయా అంశాలు అసెట్ విలువలు ‘కొనుగోళ్లకు’ ఆకర్షణగా మారేందుకు దోహదపడతాయి. -
కొన్ని క్షేత్రాల్లో గ్యాస్‌కు మార్కెట్ ధర!
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు కొత్తగా కొన్ని క్షేత్రాల్లో వెలికితీసే సహజవాయువును మార్కెట్ ధరకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించనుంది. దేశీయంగా గ్యాస్ అన్వేషణ, ఉత్ప త్తి పెంపునకు ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. గతేడాది అక్టోబర్‌లో మోదీ సర్కారు కొత్త గ్యాస్ ధరల విధానాన్ని ఆమోదించడం తెలిసిందే. డీప్-వాటర్, అల్ట్రా-డీప్ సీ తదితర క్లిష్టతరమైన క్షేత్రాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధిక రేటును అనుమతించాలని పాలసీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశీయంగా ఉత్ప త్తి అవుతున్న గ్యాస్‌కు ఒక్కో యూనిట్ ధరను 4.66 డాలర్లుగా కేంద్రం కొనసాగిస్తోంది. దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఆధారంగా మార్కెట్ రేటు 7-8 డాలర్ల మధ్య ఉంటుంది. -
గ్యాస్ మాయ
ధర తగ్గినా పెరగని సబ్సిడీ కంపెనీలకే లాభం.. ప్రజలకు శఠగోపం మండిపడుతున్న ప్రజాసంఘాలు విజయవాడ : అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కనిపించడం లేదు. ధరలు తగ్గిన మేరకు వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గిన ధరలను చమురు కంపెనీల వాటాలో జమచేసి, వినియోగదారుడికి మొండిచేయి చూపుతోందని ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఏడాదిలో రూ.1,350 నుంచి రూ.778 వరకు గ్యాస్ ధర తగ్గినా సబ్సిడీ మాత్రం పెరగకపోవటంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించింది. గత జనవరిలో డొమెస్టిక్ సిలెండర్ ధర రూ.778 ఉండగా, ఫిబ్రవరిలో రూ.668కి చేరింది. రూ.778 చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారుకు బ్యాంకుఖాతాలో రూ.336.50 జమ అయ్యేది. వినియోగదారు సిలిండరుకు రూ.441.50 భరించాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో రూ.668కి గ్యాస్ సిలిండర్ ధర తగ్గగా, ఆ మొత్తం చెల్లించిన వినియోగదారుకు బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.226.50 జమ పడుతోంది. వినియోగదారులు సిలిండరును రూ.441.50కే కొనుగోలు చేయాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండరు ధర తగ్గినా.. వినియోగదారులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కల్పించలేదని తేటతెల్లమవుతోంది. తగ్గించిన గ్యాస్ ధర చమురు కంపెనీలకే మేలు చేస్తోందని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఆధార్ అనుసంధానం కాకుంటే 14 నుంచి సబ్సిడీ గల్లంతే... ఈ నెల 14 నుంచి ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాకపోతే గ్యాస్ సబ్సిడీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కటాఫ్ డేట్ ఈ నెల 13తో ముగుస్తోంది. ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వినియోగదారులు ఈ నెల 14 నుంచి గ్యాస్ సిలిండర్ పూర్తి మొత్తం చెల్లించి కొనుగోలు చేయాలి.. 13 వరకు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి పార్కింగ్ పిరియడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు చివరి అవకాశం ఇచ్చింది. అది 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు నెలల్లో ఆధార్‌ను అనుసంధానం చేసుకుంటే సబ్సిడీ మొత్తం వెనక్కి ఇస్తారు. -
కాంగ్రెస్‌ను ఓడించాలి
అలింగాపురం, (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం శాసనసభ పక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. గురువారం ఆయన మండలంలోని అలింగాపురం, గుండ్లపహాడ్, బొత్తలపాలెం గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసుత్నమిత్రపక్షాల అభ్యర్థులను గెలి పించాలని కోరుతూ నిర్వహించిన ప్రచార కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతియడంతో పాటు 9 గం టల విద్యుత్ ఇస్తామని, నాలుగుగంటలు కూడా సరఫరా చేయాలేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, ఎరువులు, బస్సుచార్జీలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక తెలంగాణను తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాల కారణంగా తెలంగాణ వచ్చిందే తప్ప కాంగ్రెస్ వల్ల కాదన్నారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రయోజనం ఉండదన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె.అనంత ప్రకాశ్, టీడీపీ మండల అధ్యక్షుడు నాగండ్ల శ్రీధర్, మిత్ర పక్షాల నాయకులు కుంకు తిరుపతయ్య, వాస సంపత్, కె. నగేష్, హబీబ్, యలమంద, మీనయ్య, యడ్ల సైదులు, పసుపులేటి సైదులు, బోగాల వీరారెడ్డి, రఘు నాయక్ పాల్గొన్నారు. -
మా ప్రశ్నలకు బదులివ్వండి: కేజ్రీవాల్
మోడీకి కేజ్రీవాల్ లేఖాస్త్రం న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రశ్నాస్త్రాలు సంధించింది. అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తారో లేదో తేల్చి చెప్పాలని మోడీని డిమాండ్ చేసింది. శుక్రవారం పలు ప్రశ్నలతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్.. మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చదివి వినిపించారు. దానిలో ప్రధానాంశాలు.. ప్రధాని అభ్యర్థి అయిన మీరు (మోడీ).. ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే గ్యాస్ ధరను 8 డాలర్ల నుంచి 4 డాలర్లకు తగ్గిస్తారో, లేదో తెలుసుకోవాలని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు. ఆర్ఐఎల్ అధినేత ముకేష్ అంబానీతో మీకూ, కాంగ్రెస్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే మౌనం దాల్చుతున్నారా? ఆర్ఐఎల్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేయడంలోనే ముకేష్తో మీ సంబంధాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని మీరు పదే పదే చెపుతున్నారు. అంబానీలకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. వాళ్ల డబ్బునూ వెనక్కి రప్పిస్తారా? మీరు, రాహుల్‌గాంధీ ప్రచారం కోసం వెళ్లే హెలికాప్టర్లకు, సభలకు ముఖేషే నిధులిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అవి నిజమేనా? -
స్తంభించిన గ్యాస్ సరఫరా
తగ్గింపు వివరాలు ఏజెన్సీలకు అందని వైనం నిలిచిపోయిన విక్రయాలు జిల్లాలో ప్రజల ఇక్కట్లు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించినా ఆ మేరకు ఉత్తర్వులు అందకపోవడంతో జిల్లాలో శనివారం సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు కూడా గ్యాస్ సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలలో కూడా అమ్మకాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నెత్తిన భారం మోపిన కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.110, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.270 తగ్గించింది. దీని ప్రకారం గృహావసరాలకు వాడే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం సబ్సిడీతో కలిపి రూ.1,320 ఉండగా ఫిబ్రవరి నుంచి రూ.1,210 చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాన్ సబ్సిడీలో సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రూ.2,320 నుంచి రూ.2,050కి తగ్గింది. నిలిచిపోయిన విక్రయాలు... తగ్గించిన ధరల వివరాలను చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు పంపకపోవటంతో విజయవాడ నగరంలో, జిల్లాలో 76 గ్యాస్ ఏజెన్సీలలో సిలిండర్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రతిరోజూ జిల్లాలో 21 వేల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తారని అంచనా. ఆధార్ లింక్‌పై ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్‌పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఏడాదికి గతంలో ఇచ్చే తొమ్మిది సిలిండర్లను 12కి పెంచుతూ ప్రభుత్వం నుంచి గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రెండు సిలెండర్లు ప్రతి వినియోగదారునికీ ఇస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఏడాదికి 12 సిలెండర్లు సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
`గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుంది`
హైదరాబాద్: మరోమారు గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుందోని ఆయన విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేయడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసింది వాస్తవం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని నల్లా సూర్యప్రకాశ్‌రావు చెప్పారు. కాగా, ప్రభుత్వం వినియోగదారులపై సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. దీంతో వినియోగదారుడు మొదట సిలిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. -
బండడు కష్టాలు
మిర్యాలగూడ/హుజూర్నగర్, న్యూస్‌లైన్: గ్యాస్ వినియోగదారులపై మళ్లీ పిడుగు పడింది. సబ్సిడీ వంట గ్యాస్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరగడంతో ‘బండ’ భారంగా మారింది. ఇటీవల కాలంలోనే మూడు పర్యాయాలు గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం మళ్లీ తాజాగా సిలిండర్‌పై రూ.25లు పెంచింది. ఈమేరకు 2013 డిసెంబర్ 31న అర్ధరాత్రి గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లా ప్రజలపై నెలకు రూ.50లక్షల భారం పడనుంది. పెంచిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీల్లో 6.54 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.420 ఉండగా దీనిపై అదనంగా 25 రూపాయలు పెంచారు. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.445కు చేరింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలకు సుమారుగా 2లక్షల గ్యాస్ కనెక్షన్లను వినియోగదారులు రీఫిల్లింగ్ చేయించుకుంటారు. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌కు రూ.25 చొప్పున రెండు లక్షల గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్‌కు జిల్లా ప్రజలపై నెలకు రూ.50 లక్షల భారం పడనుంది. పెరిగిన ధరలు ఇలా.. సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.420 ఉండగా ఇప్పుడు రూ.25 పెంచి 445 రూపాయలకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి గతంలో రూ.1111ఉండగా ఇప్పుడు 216 రూపాయలు పెరిగింది. దీంతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారి సిలిండర్ రీఫిల్లింగ్‌కు రూ.1327 చెల్లించాలి. వారికి బ్యాంకు ఖాతాలో రూ.839.50 వేయనున్నారు. దీంతో ఆధార్ అనుసంధానం చేసుకున్న వినియోగదారుడిపై మరో 42.50 రూపాయలు అదనపు భారం పడనుంది. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు గతంలో రూ.1882 ఉండగా ఇప్పుడు రూ.386 పెరిగింది. దీంతో కమర్షియల్ గ్యాస్ రీఫిల్లింగ్‌కు రూ.2268 చెల్లించాల్సి వస్తుంది. గ్యాస్ ధర పెంపుతో ఆర్థిక భారం ప్రభుత్వం గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతుంది. ఇటీవలనే రూ.12 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.25 పెంచడం వల్ల ఆర్ధిక భారం పెరిగిపోతుంది. ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వినియోగదారులు అదనపు ధర చెల్లించాల్సి వస్తుంది. - తుమ్మలపల్లి కవిత, మిర్యాలగూడ -
జనం నెత్తిన గ్యాస్ బండ
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఓవైపు చమురు కంపెనీలు ఎడాపెడా చమురు, గ్యాస్ ధరలు పెంచుతూ వినియోగదారుడిని బాదేస్తూ, బాధిస్తూ ఉంటే, స్థానికంగా తామేం తక్కువ తిన్నామన్న చందంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలను అతిక్రమించి మరింత భారం మోపుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో వినియోగదారులందరి నుంచి రుసుము వసూలు చేస్తూ అయినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనల ఉల్లంఘన : ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ ధర రూ. 402 ఉంది. సిలెండర్‌ను ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల లోపు వినియోగదారులకు అందజేస్తే ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీలు వీటిని ఖాతరు చేయడం లేదు. ఐదు కిలోమీటర్లకు లోబడి నివసిస్తున్న వారికి గ్యాస్ సరఫరా చేసినా ధరకు అదనంగా రూ. 22 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి లెక్కిస్తే నర్సీపట్నంలో ఉన్న సుమారు 20 వేల మంది వినియోగదారుల నుంచి ప్రతి నెలా రూ. 4.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తూ అదనపు బారం మోపుతున్నారు. కొత్త కనెక్షన్ కష్టాలు : వినియోగదారులెవరైనా కొత్తగా కనెక్షన్ తీసుకుంటే ఏజెన్సీ నిర్వాహకుల పంట పండినట్టే. తాము చెప్పే కంపెనీకి చెందిన స్టవ్‌ను, ఇతర సామగ్రిని కొంటేనే కనెక్షన్ ఇస్తామని షరతులు పెడుతున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా నిర్వాహకులు విధించిన షరతులకు లోబడి వస్తువులు కొనుగోలు చేసి కనెక్షన్ పొందాల్సి వస్తోంది. వినియోగదారుల సమస్యలను ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా వ్యవహరిస్తున్న ఓ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారుల సంఘం కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఇటీవల పెట్రోలియం సంస్థకు ఈ-మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు కూడా. మరి అధికారులు ఏ రీతిన స్పందించి సమస్యలు పరిష్కరిస్తారో చూడాలి.