రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment