Wood stove
-
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
కట్టెల పొయ్యిలతోనే కాలుష్యం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యిలు ఎక్కువ వాడుతారనే విషయం తెల్సిందే. ఈ పొయ్యిల వల్ల ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడంలో భాగంగా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్‌లను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పేదల ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షన్’ తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ల కోసం నెలకు ఐదారు వందలు పెట్టాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యిలోకి కట్టెలు ఉచితంగా దొరకడం వల్ల ఆ పథకం అంతగా విజయవంతం కాలేదు. కట్టెల పొయ్యిల వల్ల ఎంత వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాతావరణంలోని ‘పీఎం–2.5’ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పీఎం–2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ (నలుసులు లేదా రేణువులు) 2.5 సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉండడం. ఇవి రోజుకు ఒక్క ఇంటి పొయ్యి నుంచి వెలువడుతాయంటే ఓ ట్రక్కు రోజంతా తిరిగితే వెలువడే రేణువులకన్నా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న కట్టెల పొయ్యిలన్నింటికి 2022 నాటికి స్వస్తి చెప్పాలన్నది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సు నిర్మాణం. ఈ దిశగా లండన్ ఇప్పటికే చర్యలు పట్టింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 17 లక్షల మంది కట్టెల పొయ్యిలను ఇప్పటికీ వాడుతున్నారు. వారు వంటకోసం కాకుండా రూమును వెచ్చబరచడం కోసమే ఎక్కువగా వాడుతారు. ఇప్పుడవి రకారకాల డిజైన్లలో వస్తుండడంతో వాటి పట్ల లండన్ వాసులకు ఆకర్షణ కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ రూమ్ ఈటర్ల కన్నా ఈ కాచుకొనే కట్టెల పొయ్యిలను వాడడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదవడమే కాకుండా ఆకర్షణీయంగా ఉండడం కారణం. భారత్‌లోని కట్టెల పొయ్యిల కన్నా లండన్ వాసుల పొయ్యిల ద్వారా తక్కువ కాలుష్యమే ఏర్పడుతుంది. అయినా వారికి అదే ఎక్కువట. మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో కలుగుతున్న కాలుష్యంలో వారి కట్టెల పొయ్యిల వల్ల వెలువడుతున్న కాలుష్యం దాదాపు 30 శాతం అట. భారత కట్టెల పొయ్యిల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడగానికి కారణం ఏ కట్టెలు దొరికితే అవే వాడేయడం, కొన్నిసార్తు పచ్చి కట్టలు కూడా వాడడం. లండన్ వాసులు ప్రత్యేక దుంగలను వాడుతారు. చిన్న చిన్న దుంగలను, పూర్తిగా ఎండిన దుంగలను, అవి కొన్ని ప్రత్యేక రకాలకు చెందిన దుంగలను మాత్రమే వాడాలంటూ అక్కడి ప్రభుత్వం వారికి మార్గదర్శకాలను నిర్దేశించింది. పొయ్యిల నుంచి ఎక్కువ పొగ రాకుండా ఎక్కువ మంట వచ్చే విధంగా పొయ్యిల నిర్మాణం ఉండాలంటూ వాటిని తయారు చేసే కంపెనీలకు కూడా మార్గదర్శకాలను సూచించింది. ఈ మేరకు ఇప్పుడు అక్కడి మార్కెట్లోకి ఐదు కిలోవాట్ల ‘సిల్వర్ డలే 5 ఎస్ఈ’ వుడ్ బర్కింగా స్టవ్ వచ్చింది. దాని ధరం 525 పౌండ్లు (దాదాపు 48 వేలు). అలాగే ‘బెల్టనే మిడ్‌ఫోర్డ్ ఎస్సీ’ వుడ్ బర్నింగ్ స్టవ్ వచ్చింది. దాని ధర 946 పౌండ్లు (86 వేలు). -
ఇదోరకం కట్టెల పొయ్యి
కొన్ని సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యి మీదే వంట చేసేవారు. అందరికీ ఇంకా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ పల్లెల్లో కొందరు కట్టెల పొయ్యి మీదే∙వండుతున్నారు. నగరాలలో ఉండేవారు వండుకోవాలనుకుంటే, రెడీ మేడ్ కట్టెల పొయ్యి 800 రూపాయలకు అందుబాటులో ఉంది. నిఖిల్ ఇంజినీర్స్ స్మార్ట్ వుడ్ బర్నింగ్ కుక్ స్టవ్ పేరుతో గూగుల్‌లో వెతికితే ఈ స్టౌ సమాచారం దొరుకుతుంది. ఈ పొయ్యిలో వంటచెరకుగా... కట్టెలు, పిడకలు, ఎండు పుల్లలు, చితుకులు, ఎండుటాకులు... వేటినైనా వాడుకోవచ్చు. పొగ తక్కువ వస్తుంది. ఉపయోగించడం కూడా సులువే. ఈ స్టౌ మీద భారీ వంటలు చేయడానికి అవకాశం లేదు. ఇంట్లో సరదాగా వాడుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తలు: ►స్టవ్‌ను సమతలంగా ఉన్న ప్రదేశం మీద ఉంచాలి ►స్టౌ వెలిగించాక ముట్టుకోకూడదు ►పిల్లలకు దూరంగా ఉంచాలి ►మండేపదార్థాలను దూరంగా ఉంచాలి ►బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో ఉపయోగించాలి ►వర్షం పడే చోటులో ఉంచకూడదు ►స్టౌ శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించకూడదు. -
కొంప ముంచిన కట్టెల పొయ్యి
గరికివలస గ్రామంలో రోజూలాగే గ్రామస్తులంతా పొలం పనులకు ఆదివారం ఉదయం వెళ్లిపోయారు. గ్రామంలో ఓ పూరింట్లో వెలిగించిన కట్టెల పొయ్యిను ఆర్పడం మరచిపోయారు. అది కాస్త గాలికి రాజి మంటలు చేలరేగాయి. దీంతో పొట్నూరు తవుడు ఇల్లు కాలిపోయింది. తరువాత పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. జరిగిన సంఘటనతో బాధితులంతా గొల్లుమన్నారు. గుర్ల: మండలంలోని గరికివలసలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు...గ్రామానికి చెందిన పొట్నూరు తవుడు ఇంట్లో ఉన్న కట్టెల పోయ్యి బొగ్గులు అర్పకుండా వదిలేశారు. గాలికి బొగ్గులు నిప్పు రాజుకోని ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. తరువాత మంటలు పక్కనే ఉన్న పొట్నూరు ఆదిలక్ష్మి, పొట్నూరు లక్ష్మి, పొట్నూరు పాపినాయుడు, పెనుమజ్జి పైడమ్మ, పొట్నూరు తవిటినాయుడు, పొట్నూరు పాపినాయుడు ఇళ్లకు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఇళ్లల్లో సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు బోరుమన్నారు. గ్రామంలో అందరూ పోలం పనులకు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నేత బెల్లాన వెంకటరమణ, వీఆర్వో మీసాల చిన్నారావు ఉన్నారు. పాతబగ్గాంలో... గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన లెంక అప్పయ్యమ్మ మిద్దె ఇల్లు ఆదివారం కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...కార్తీక మాసం పూజలు చేస్తున్న సందర్భంగా పలువురు ఇంట్లో దీపాలు పెట్టడంతో ఆ దీపం ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లెంక అప్పయ్యమ్మ ఇంట్లో తినడానికి దాచుకున్న ధాన్యం, బట్టలు, తదితర వంట సామగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో బాధితురాలు కట్టుబట్టలతో మిగిలింది. ప్రమాదం జరిగినప్పుడు అప్పయ్యమ్మ వరి కోతలకు వెళ్లి పోయింది. ఆమె కుమార్తె వరలక్ష్మి ఇంటి వద్ద ఉంది. సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసిన వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మహేశ్వరరావు గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నష్టాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజీవరావు అంచనా వేశారు. సర్పంచ్ లెంక పద్మావతి బాధితురాలిని పరామర్శించారు. -
‘మధ్యాహ్నా’నికి కట్టెల పొయ్యిలే దిక్కు
నిజాంసాగర్ : మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్లు, స్టౌలు మూలనపడ్డాయి. పాఠశాలల వారీగా అందించిన గ్యాస్ కనెక్షన్లకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేయకపోవడంతో వంట ఏజెన్సీలకు కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇరుకుగా ఉన్న వంటశాల గదులు, వరండాల్లో వంట తయారీకి ఏజెన్సీల నిర్వాహకులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వంట ఏజెన్సీల కష్టాలపై దృష్టి సారించడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న నిర్వాహకులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెం డు అంచెల పద్ధతిన బిల్లులు చెల్లిస్తున్నాయి. అవి వంట ఏజెన్సీలకు స్లాబ్ ధరలు ఏమాత్రం కడుపునింపడం లేవు. నెలనెలా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల పాలవుతున్నా రు. పాఠశాలల గ్యాస్ బండలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 2,303 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. 2 లక్షల కు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం లబ్ధిపొందుతున్నారు. పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు.. వంట ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు ఒక్కపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం స్లాబ్రేట్లను పెంచకపోవడంతో కార్మికులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 6 చొప్పున వంట ఏజెన్సీలకు బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం వంట కార్మికులకు చెల్లిస్తున్న బిల్లులు నిర్వాహకులకు ఏమాత్రం సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో సిలిండర్లను, గ్యాస్ స్టౌలను మూలన పడేశారు.