ఇదోరకం కట్టెల పొయ్యి | Nikhil Engineers Smart Wood Burning Cook Stove | Sakshi
Sakshi News home page

ఇదోరకం కట్టెల పొయ్యి

Published Sat, Nov 2 2019 4:21 AM | Last Updated on Sat, Nov 2 2019 4:21 AM

Nikhil Engineers Smart Wood Burning Cook Stove - Sakshi

కొన్ని సంవత్సరాల క్రితం కట్టెల పొయ్యి మీదే వంట చేసేవారు. అందరికీ ఇంకా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ పల్లెల్లో కొందరు కట్టెల పొయ్యి మీదే∙వండుతున్నారు. నగరాలలో ఉండేవారు వండుకోవాలనుకుంటే, రెడీ మేడ్‌ కట్టెల పొయ్యి 800 రూపాయలకు అందుబాటులో ఉంది. నిఖిల్‌ ఇంజినీర్స్‌ స్మార్ట్‌ వుడ్‌ బర్నింగ్‌ కుక్‌ స్టవ్‌ పేరుతో గూగుల్‌లో వెతికితే ఈ స్టౌ సమాచారం దొరుకుతుంది. ఈ పొయ్యిలో వంటచెరకుగా... కట్టెలు, పిడకలు, ఎండు పుల్లలు, చితుకులు, ఎండుటాకులు... వేటినైనా వాడుకోవచ్చు. పొగ తక్కువ వస్తుంది. ఉపయోగించడం కూడా సులువే. ఈ స్టౌ మీద భారీ వంటలు చేయడానికి అవకాశం లేదు. ఇంట్లో సరదాగా వాడుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

జాగ్రత్తలు:
►స్టవ్‌ను సమతలంగా ఉన్న ప్రదేశం మీద ఉంచాలి
►స్టౌ వెలిగించాక ముట్టుకోకూడదు
►పిల్లలకు దూరంగా ఉంచాలి
►మండేపదార్థాలను దూరంగా ఉంచాలి
►బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రాంతంలో ఉపయోగించాలి
►వర్షం పడే చోటులో ఉంచకూడదు
►స్టౌ శుభ్రం చేయడానికి నీటిని ఉపయోగించకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement