న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు కొత్తగా కొన్ని క్షేత్రాల్లో వెలికితీసే సహజవాయువును మార్కెట్ ధరకు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించనుంది. దేశీయంగా గ్యాస్ అన్వేషణ, ఉత్ప త్తి పెంపునకు ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. గతేడాది అక్టోబర్‌లో మోదీ సర్కారు కొత్త గ్యాస్ ధరల విధానాన్ని ఆమోదించడం తెలిసిందే. డీప్-వాటర్, అల్ట్రా-డీప్ సీ తదితర క్లిష్టతరమైన క్షేత్రాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధిక రేటును అనుమతించాలని పాలసీలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం దేశీయంగా ఉత్ప త్తి అవుతున్న గ్యాస్‌కు ఒక్కో యూనిట్ ధరను 4.66 డాలర్లుగా కేంద్రం కొనసాగిస్తోంది. దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఆధారంగా మార్కెట్ రేటు 7-8 డాలర్ల మధ్య ఉంటుంది.
కొన్ని క్షేత్రాల్లో గ్యాస్‌కు మార్కెట్ ధర!
Published Mon, May 18 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement