`గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుంది`
హైదరాబాద్: మరోమారు గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుందోని ఆయన విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేయడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసింది వాస్తవం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని నల్లా సూర్యప్రకాశ్‌రావు చెప్పారు.
కాగా, ప్రభుత్వం వినియోగదారులపై సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. దీంతో వినియోగదారుడు మొదట సిలిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి.