వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ్ ధ్వజం
ఖమ్మం/చిట్యాల: తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు అడుగుజాడల్లోనే పయనిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట సమన్వయ కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో, నల్లగొండ జిల్లా చిట్యాలలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ అయిపోయిందని చెబుతున్నారే తప్ప ఇంత వరకు రైతుల ఖాతాల్లో ఒక్క పైసా జమ చేయలేదన్నారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రైతు మరణాలు సాగుతున్నా ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు. దళితుడినే సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్.. తర్వాత మాట మార్చారని విమర్శించారు.
వైఎస్ హయాంలో కోట్ల రూపాయలు కేటాయించి పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. మాటలగారడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం పండుగలను జరుపుతూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు బాటలోనే కేసీఆర్
Published Mon, Oct 6 2014 12:19 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement