Nalla suryaprakash rao
-
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి పదవీ స్వీకార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ, బీజేపీల కంటే తమ పార్టీ బలంగా ఉందన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ ఎదుగుదలను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల సాధన కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్ అహ్మద్, కార్యదర్శి జి.రాంభూపాల్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బాటలోనే కేసీఆర్
వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ్ ధ్వజం ఖమ్మం/చిట్యాల: తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు అడుగుజాడల్లోనే పయనిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట సమన్వయ కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన ఖమ్మంలో, నల్లగొండ జిల్లా చిట్యాలలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ అయిపోయిందని చెబుతున్నారే తప్ప ఇంత వరకు రైతుల ఖాతాల్లో ఒక్క పైసా జమ చేయలేదన్నారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రైతు మరణాలు సాగుతున్నా ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు. దళితుడినే సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్.. తర్వాత మాట మార్చారని విమర్శించారు. వైఎస్ హయాంలో కోట్ల రూపాయలు కేటాయించి పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. మాటలగారడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం పండుగలను జరుపుతూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. -
మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్/గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం, అభద్రతకు గురౌతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. తమ పార్టీ నాయకులతో ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు విన్నవించిన దళితుడిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పయ్యావుల దాడి తగదన్నారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు. ఓటమి భయంతో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బీజేపీ వద్దన్నా వినకుండా కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రూరల్ ఉప్పరపాలెం, కొత్తపాలెం, పెదఇటికంపాడులలో రావి వెంకటరమణతో బాలశౌరి కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
`గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుంది`
హైదరాబాద్: మరోమారు గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లా సూర్యప్రకాశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ఇంటికే నిప్పు పెడుతుందోని ఆయన విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేయడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసింది వాస్తవం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని నల్లా సూర్యప్రకాశ్‌రావు చెప్పారు. కాగా, ప్రభుత్వం వినియోగదారులపై సబ్సిడీ సిలిండర్ (14.2 కేజీ) ధర రూ.1,112 నుంచి రూ.1,327కు పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. దీంతో వినియోగదారుడు మొదట సిలిండర్ తీసుకునేటప్పుడు రూ.215 అదనంగా చెల్లించాలి. -
చంద్రబాబుకు ఊడిగమేల ? : నల్లా సూర్యప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ దుయ్యబట్టారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు మంద కృష్ణ తహతహలాడుతున్నారని... అందులో భాగంగానే తమ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మొరగమంటే ఓ బొచ్చుకుక్కలా మొరుగుతున్న మంద కృష్ణను మాదిగలే తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు. న్యాయస్థానాల్లో కేసు తేలకముందే యావజ్జీవ లేదా మరణశిక్ష వేయాలంటూ మందకృష్ణ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. చంద్రబాబు మాదిగలను వంచించి, మభ్యపెట్టగా,దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే రాష్ట్రంలో మాదిగలకు సంపూర్ణమైన న్యాయం చేశారని చెప్పారు.రాష్ట్రంలోని రిజర్వుడు పార్లమెంటరీ స్థానాల్లో మాల, మాదిగలకు సమన్యాయం చేశారని, అలాగే, లోక్‌సభ,శాసనసభ ఎన్నికల్లో జనరల్ స్థానాలను కూడా మాదిగలకు కేటాయించిన ఘనత రాజశేఖరరెడ్డిదన్నారు.