టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే | T R S substitute yarcp party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

Published Tue, May 17 2016 3:02 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే - Sakshi

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

 వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు

మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి పదవీ స్వీకార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ, బీజేపీల కంటే తమ పార్టీ బలంగా ఉందన్నారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ ఎదుగుదలను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, వారికి తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తండ్రి ఆశయాల సాధన కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్ అహ్మద్, కార్యదర్శి జి.రాంభూపాల్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement