మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌ | Nalla Surya Prakash Rao Condemn attack on dalits in anantapur district | Sakshi
Sakshi News home page

మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌

Published Wed, Apr 2 2014 6:31 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌ - Sakshi

మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌

హైదరాబాద్/గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం, అభద్రతకు గురౌతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్‌ విమర్శించారు. తమ పార్టీ నాయకులతో ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు విన్నవించిన దళితుడిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పయ్యావుల దాడి తగదన్నారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు.  

ఓటమి భయంతో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బీజేపీ వద్దన్నా వినకుండా కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రూరల్ ఉప్పరపాలెం, కొత్తపాలెం, పెదఇటికంపాడులలో రావి వెంకటరమణతో బాలశౌరి కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement