
రిక్షా తొక్కుతూ నిరసన తెలుపుతున్న సునీతారావు
సాక్షి, హైదరాబాద్: పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ధరలను తగ్గించాలని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడి డిసాజో పిలుపు మేరకు గురువారం గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడారు. పెట్రో ధరల పెంపు ప్రభావంతో అనేక నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో, డీజిల్ ధరల పెంపుపై సునీతారావు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసి స్తూ గాంధీభవన్ ఎదుట కట్టెల పొయ్యి మీద వంటావార్పు చేశారు.