కాంగ్రెస్‌ను ఓడించాలి | defeat the congress in elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ఓడించాలి

Published Fri, Apr 4 2014 2:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ను ఓడించాలి - Sakshi

కాంగ్రెస్‌ను ఓడించాలి

అలింగాపురం, (నేరేడుచర్ల), న్యూస్‌లైన్  : అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం శాసనసభ పక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. గురువారం ఆయన మండలంలోని అలింగాపురం, గుండ్లపహాడ్, బొత్తలపాలెం గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసుత్నమిత్రపక్షాల అభ్యర్థులను గెలి పించాలని కోరుతూ నిర్వహించిన ప్రచార కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతియడంతో పాటు 9 గం టల విద్యుత్ ఇస్తామని, నాలుగుగంటలు కూడా సరఫరా చేయాలేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, ఎరువులు, బస్సుచార్జీలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక తెలంగాణను తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాల కారణంగా తెలంగాణ వచ్చిందే తప్ప కాంగ్రెస్ వల్ల కాదన్నారు.
 
తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే  ప్రయోజనం ఉండదన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె.అనంత ప్రకాశ్, టీడీపీ మండల అధ్యక్షుడు నాగండ్ల శ్రీధర్, మిత్ర పక్షాల నాయకులు కుంకు తిరుపతయ్య, వాస సంపత్, కె. నగేష్, హబీబ్, యలమంద, మీనయ్య, యడ్ల సైదులు, పసుపులేటి సైదులు, బోగాల వీరారెడ్డి, రఘు నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement