mptc positions
-
ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్తత
నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 6 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్ గెలుపొందింది. నర్సంపేట ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. ఎంపీటీసీల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోగా.. 6వ తేదీ రాత్రి ఇరు పార్టీల ఎంపీటీసీలు నర్సంపేటకు చేరుకున్నారు. అదే రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనిక, రాజుపేట ఎంపీటీసీ బాదావత్ వీరన్నలను టీఆర్ఎస్ శిబిరంలోకి తీసుకున్నారు. విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఉన్న నలుగురు ఎంపీటీసీలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. లక్నెపల్లికి చెందిన ఎంపీటీసీ వల్లెరావు రజితను కిడ్నాప్ చేశా రని ఆమె భర్త బుచ్చయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎంపీటీసీ భర్త ఫిర్యాదు మేరకే లక్నెపల్లి రజితను స్టేషన్‌కు తీసుకువచ్చామని, ఆమెను భర్తకు అప్పగిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్టేషన్ నుంచి రజితను బుచ్చయ్య తీసుకెళ్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మహిళా నేత చెప్పుతో టీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహేశ్వరం ఎంపీటీసీ మోతె కలమ్మ ఎంపిక కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనికకు వైస్ ఎంపీపీగా అవకాశం దక్కింది. నిరసన ‘మంటలు’ పీసీసీ పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదని ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కార్యకర్తలు దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందులో కొందరు కార్యకర్తలు, పోలీసులు చిక్కుకున్నారు. వారికి మంటలు అంటుకోవడంతో ఎవరికి వారు పరుగులు తీశారు. చెల్లాచెదురుగా పడిపోయారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. సాక్షి ఫొటో జర్నలిస్టు, ఖమ్మం -
పోరు ప్రశాంతం
- 4 సర్పంచ్...27 వార్డు స్థానాలకు ఎన్నికలు - 2 ఎంపీటీసీ స్థానాలకు కూడా.. - రెండు వార్డుల ఎన్నిక వాయిదా - సైనాల, డీసీ తండా పంచాయతీ ఎన్నికలు సైతం.. వరంగల్ అర్బన్ : జిల్లాలో 4 సర్పంచ్, 27 వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం విజేతలకు అధికారులు గెలుపుపత్రాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 7 పంచాయతీలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చినా.. నెల్లికుదురు మండలం సైనాల, వర్ధన్నపేట మండలం డీసీ తండాకు నామినేషన్లు రాని కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ములుగు మండలం పోట్లాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదేవిధంగా 29 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. గీసుకొండ మండలంలోని రెండు వార్డులకు గుర్తుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల వల్ల అక్కడ కూడా ఎన్నికలు ఈనెల 9కి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటింది. తొలి ారిగా జిల్లాలో మూడు పంచాయతీలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. విజేతలు వీరే... వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి సర్పంచ్‌గా ఆదెపు దయాకర్,స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్ సర్పంచ్‌గా నంగునూరి రాధిక, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్‌గా నర్రపద్మ, నర్సంపేట మండలం కమ్మపల్లి సర్పంచ్‌గా అజ్మీర విజయ ఎన్నికయ్యారు. వార్డుల విజేతలు గొడవటూరు పంచాయతీ(10వ వార్డు) బుర్రలక్ష్మి, బాన్జీపేట(9)చెట్ల బాబు, నిడిగొండ(6) మైలారపు స్వరూప, చౌటపల్లి(11)దామెర లచ్చమ్మ, విసునూరు(7)లకావత్ బిక్షం, తోరనాల(6)రచ్చ బాలలక్ష్మి,కొత్తూరు(10)గాదె కౌసల్య, వడ్డేకొత్తపల్లి(4)సాయిబాబు, పంతిని(7)శాన రాజమణి,ఒంటిమామిడిపల్లి(1)గాజు కొమురమల్లు,(2)మజ్జిగ శారద,(3)అప్సర భేగం,(4)ఎండీ.రఫీ,(6)మజ్జిగ రాములు,(7) అద్దెంకి సంధ్య,(8)ఏసీరెడ్డి ర జిత, (10)కె.రాజు, నైనాల(5)కొండపల్లి స్మిత, దాట్ల(7)బాషపంగు మహేందర్, పెరుమాండ్ల సంకీస(5)కిన్నెర బాబు, బుధరావుపేట(13)గుగులోత్ నీలమ్మ,తండా ధర్మారం(5)గుగులోత్ ధాని, సాదిరెడ్డిపల్లి(10) వాసం పావని, మాధవపురం(9)గుగులోత్ భద్రు, జంగాలపల్లి(3) సానబోయిన స్వాతి, బుద్దారం(4)గడ్డం మహేందర్, సుబ్బక్కపల్లి(2) సముద్రాల రాజయ్యఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. కేశిరెడ్డిపల్లి, ఊరట్టంలోఎంపీటీసీ.. బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. 76.7 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమాదేవి తెలిపారు. 1846 ఓట్లకు గాను, సాయంత్రం 5 గంటల వరకు 1417 ఓట్లు పోలైనాయన్నారు. ఈ నెల6న స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎస్ఎసై తాడ్వారుు మండలంలోని ఊరట్టం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2315 ఓట్లకు 1770 ఓట్లు పోలయ్యూరు. -
నేటినుంచి ‘ఎంపీటీసీ’ నామినేషన్ల స్వీకరణ
ధర్పల్లి/నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలంలోని మైలారం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల్లు స్వీకరించనున్నట్లు ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మైలారం ఎంపీటీసీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 6న నామినేషన్ల పరిశీలన, 7న ఆర్డీఓకు అప్పీల్, 9న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. 18న పోలింగ్, 19న ఉదయం 8 గంటల నుంచిఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మైలారం, బండపల్లి ఎంపీటీసీల ఎన్నిక వేలం పాట ద్వారా ఏకగ్రీవం కావటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికలను రద్దు చేసింది. ఈసారి ఎన్నికకు వేలం పాట లేకుండా చూసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్నుమ్న, జిల్లా ఎస్పీ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ఎన్నిక ద్వారానే ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకునేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. -
కాంగ్రెస్‌ను ఓడించాలి
అలింగాపురం, (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం శాసనసభ పక్షనేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. గురువారం ఆయన మండలంలోని అలింగాపురం, గుండ్లపహాడ్, బొత్తలపాలెం గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసుత్నమిత్రపక్షాల అభ్యర్థులను గెలి పించాలని కోరుతూ నిర్వహించిన ప్రచార కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతియడంతో పాటు 9 గం టల విద్యుత్ ఇస్తామని, నాలుగుగంటలు కూడా సరఫరా చేయాలేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, ఎరువులు, బస్సుచార్జీలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నా రు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక తెలంగాణను తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఎందరో విద్యార్థుల బలిదానాల కారణంగా తెలంగాణ వచ్చిందే తప్ప కాంగ్రెస్ వల్ల కాదన్నారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రయోజనం ఉండదన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె.అనంత ప్రకాశ్, టీడీపీ మండల అధ్యక్షుడు నాగండ్ల శ్రీధర్, మిత్ర పక్షాల నాయకులు కుంకు తిరుపతయ్య, వాస సంపత్, కె. నగేష్, హబీబ్, యలమంద, మీనయ్య, యడ్ల సైదులు, పసుపులేటి సైదులు, బోగాల వీరారెడ్డి, రఘు నాయక్ పాల్గొన్నారు.