ధర్పల్లి/నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలంలోని మైలారం, పిట్లం మండలం బండపల్లి ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల్లు స్వీకరించనున్నట్లు ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మైలారం ఎంపీటీసీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 6న నామినేషన్ల పరిశీలన, 7న ఆర్డీఓకు అప్పీల్, 9న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు.
18న పోలింగ్, 19న ఉదయం 8 గంటల నుంచిఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మైలారం, బండపల్లి ఎంపీటీసీల ఎన్నిక వేలం పాట ద్వారా ఏకగ్రీవం కావటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఎన్నికలను రద్దు చేసింది. ఈసారి ఎన్నికకు వేలం పాట లేకుండా చూసేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్నుమ్న, జిల్లా ఎస్పీ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా ఎన్నిక ద్వారానే ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకునేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
నేటినుంచి ‘ఎంపీటీసీ’ నామినేషన్ల స్వీకరణ
Published Fri, May 2 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement