
జీఎస్‌టీ రేట్లు మరింత తగ్గుతాయని, పన్ను రేట్లు & శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. 2017 జూలై 1న GST అమలులోకి వచ్చిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గిందని అన్నారు. ఇది మరింత తగ్గుతుందని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 2021లో సీతారామన్ నేతృత్వంలోని.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్, జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి.. శ్లాబులలో మార్పులను సూచించడానికి మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు.
శనివారం ఢిల్లీలో 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో జీఎస్‌టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించాల్సిన సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నకు, నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. ఆ పని దాదాపు ముగింపు దశకు చేరుకుందని అన్నారు.
స్టాక్ మార్కెట్ అస్థిరతకు కారణాలు, మార్కెట్లు మరింత ప్రశాంతంగా ఉండటానికి మార్గం ఎలా ఉందనే ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ.. మీరు అడిగే ప్రశ్నలు.. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా?, యుద్ధాలు ముగుస్తాయా?, ఎర్ర సముద్రం సురక్షితంగా ఉంటుందా?, సముద్ర దొంగలు ఉండరా అన్నట్లు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు మీరు, నేను ఖచ్చితమైన సమాధానం చెప్పగలమా? అని అన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గింపుపై సీతారామన్ మాట్లాడుతూ.. ప్రజల వాటాను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు సీతారామన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
Comments
Please login to add a commentAdd a comment