న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో తనకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందని లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) భావిస్తోంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో.. ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా తగిన కనిష్ట స్థాయి రుణ రేట్లు పరిశ్రమలకు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. స్థూల దేశీయోత్పతిలో ఎంఎస్‌ఎంఈ రంగం వాటా 29.15 శాతం కావడం గమనార్హం.
బ్యాంకులు– ఎంఎస్‌ఎంఈల మధ్య సంబంధం అసమానంగా ఉందని, రుణ దాతల విచక్షణ పరిధిలో అసతౌల్యతకు గురవుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌ఐఎస్‌ఎంఈ) సెక్రటరీ జనర ల్ అనిల్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రయతి్నస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు.
దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతి వాటా 2023–24లో (సెపె్టంబర్ 2023 వరకు) 45.56 శాతంగా ఉంది. ఇది 2022–23లో 43.59 శాతం. కన్స ల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎంఎస్‌ఎంఈలకు మూలధన ప్రవాహాలలో నష్టాలను తగ్గించడానికి క్రెడిట్ గ్యారెంటీలు, బీమా పథకాల వంటి నష్ట నివారణ సాధనాలను ప్రోత్సహించడం మంచిని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆటో మోటివ్, ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్, ఎలక్ట్రికల్ మెషినరీ, కెమికల్స్ వంటి పరిశ్రమలకు ఈ తరహా చర్యలు అవసరమని వివరించారు. 6 శాతం మాత్రమే ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ విక్రయాల్లో ఎంఎస్‌ఎంఈ పాత్ర కేవలం 6 శాతంగా ఉంటోందని పరిశ్రమ పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment