2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల మీద దృష్టి పెట్టనుంది? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం ఎలాంటి ప్రకటనలు చేయనుందనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల హిందూ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కులం, వర్గం లేదా మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి అభ్యున్నతిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
యువకులు, మహిళలు, రైతులు, పేదవారిని సంస్కరించడానికి వారి అభ్యున్నతి వైపు దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ ఉపకరణాలను మెరుగుపరచడానికి, పౌరులకు ఆరోగ్య సంరక్షణ.. ఇతర ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
సీతారామన్ పంట అనంతర పద్ధతులను ఆధునీకరించడం, వివిధ రంగాల్లో తయారీని ప్రోత్సహించడం వంటి ప్రాముఖ్యతలను వివరించారు. బడ్జెట్‌లో మాత్రమే కాకుండా ఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్‌అండ్‌డిని మెరుగుపరచడంతోపాటు అగ్రశ్రేణి నిపుణులను సలహాదారులుగా తీసుకురావాలని కూడా చూస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా?
ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చురుకుగా పనిచేస్తున్నాయని ఆమె వెల్లడిస్తూ.. ఈ అభివృద్ధి తక్కువ ఖర్చుతో లావాదేవీలను వేగవంతం చేయడం, అంతర్గత, బాహ్య చెల్లింపులను మరింత సరసమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో సానుకూల పనితీరును కనబరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అలంటి వాదనలు చేసేవారు ఆధారాలు చూపాలని సీతారామన్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment