మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి దీన్ని పార్లమెంట్‌లో చదవనున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఇది మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం.
అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చులు, గడిచిన ఏడాదిలో ఖజానాకు వచ్చిన రాబడులను వివరిస్తుంది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌లో ఈ కింది అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
- మహిళలకు బడ్జెట్ కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో కేటాయింపులు 30 శాతం పెరిగాయని తెలుస్తుంది.
- కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తీసుకునే డబ్బుపై వడ్డీ రాయితీ పథకం ప్రకటించే వీలుంది.
- రైతులకు పంటబీమాతో పాటు తమకు తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే అవకాశం ఉంది.
- రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన ఇంధనంకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
- విద్య, ఆరోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు కేటాయించే వీలుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
- మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.
- కిసాన్ సమ్మాన్ నిధి కింది ఇచ్చే నగదును పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment