ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024 బడ్జెట్‌లో ఈవీ రంగానికి సానుకూలమైన మద్దతు ప్రకటిస్తారని వాహన తయారీ సంస్థలు ఆశిస్తున్నాయి. 2023లో భారతీయ ఈవీ రంగం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఉత్పత్తులను, విక్రయాలను సాధించనున్నట్లు తయారీదారులు చెబుతున్నారు.
2024లో చాలా వరకు ఫ్యూయెల్ కార్లఉత్పత్తి తగ్గి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమ విడిభాగాలపై వస్తువులు, సేవల పన్ను (GST) రేటును తగ్గించాలని.. బడ్జెట్ 2024లో ఫేమ్ సబ్సిడీ పథకాన్ని పొడిగించాలని పలువురు ఆశిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి తప్పకుండా ఫేమ్ III స్కీమ్ పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం అదనపు వనరులను కోరే అవకాశం ఉంది. ఫేమ్ అనేది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3W), ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (e-4W), ఎలక్ట్రిక్ బస్సుల కోసం అందించే సబ్సిడీ స్కీమ్.
ఇదీ చదవండి: చైనా కంపెనీకు చుక్కలు చూపించిన కస్టమర్.. దెబ్బకు రూ.10 లక్షలు ఫైన్!
గతంలో 7,000 ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి ఫేమ్ 2 పథకాన్ని రూ. 10000 కోట్ల బడ్జెట్ వ్యయంతో 2019లో మూడు సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సుమారు 1216380 వాహనాలకు ఇప్పటి వరకు రాయితీలు అందించారు. దీని వ్యయం 2023 డిసెంబర్ 21 నాటికి రూ. 5422 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment