నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి పెద్ద పీట వేస్తారని, ఫేమ్ సబ్సిడీ కొనసాగిస్తారని చాలామంది భావించారు. కానీ నిర్మలమ్మ ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పెద్ద ప్రకటనలు వెలువడలేదు.
మా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరిస్తుందని, కొత్త ఈవీల తయారీ మాత్రమే కాకుండా ఛార్జింగ్ వంటి వాటికి మద్దతు కల్పిస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కావలసిన మౌలిక సదుపాయాలను తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే!
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగిసిన తరువాత ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెల్లడించలేదు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల మాన్యుఫ్యాక్షరింగ్, ఇన్‌స్టాలింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment