లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అందరికి హౌసింగ్ (Housing for All) మిషన్ కింద.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-Urban) & ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-రూరల్ (PMAY-Rural) లేదా గ్రామీణ పథకాలు ఉన్నాయి. పీఎంఏవై-రూరల్ కింద 30 మిలియన్ల ఇళ్లను నిర్మించామని, కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే డిమాండ్‌ను తీర్చాడనికి వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్స్ లేదా 2 కోట్ల ఇళ్లను చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మధ్య తరగతి ప్రజల కోసం కొత్త గృహనిర్మాణ పథకంపై, అర్హులైన మధ్యతరగతి ప్రజలు స్వంత గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్ర బడ్జెట్ 2023లో ఏకంగా రూ. 79000 కోట్లు కేటాయించింది. ఇది అంతకు ముందు ప్రవేశపెట్టగా బడ్జెట్ కంటే 66 శాతం ఎక్కువ. ఇందులో 'అందరికీ హౌసింగ్' మిషన్‌ను వేగవంతం చేయడానికి పీఎంఏవై-అర్బన్‌కు రూ. 25,103 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తం పీఎంఏవై-రూరల్ పథకానికి కేటయించారు.
Comments
Please login to add a commentAdd a comment