
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్‌ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది.
ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment