మోదీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా పీఎం ముద్ర యోజన కింద 43 కోట్ల మందికి రూ.22 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. బడ్జెట్ 2024-25 ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆమె వ్యవసాయ రంగానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై పార్లమెంట్ లో మాట్లాడిన ఆమె.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఎంతో ఉదారత చూపిందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన చిన్న పరిశ్రమలను ఆదుకోవటం కోసం లక్ష్యాలను మించి అదనంగా రూ.2 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన కింద దేశంలో 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు. రైతులు సరుకు అమ్ముకోవడానికి రూ.3 లక్షల కోట్ల రూపాయలతో 1,361 మార్కెట్ యార్డులను అనుసంధానించామన్నారు. దీని వల్ల పంటల అమ్మకం ద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment