కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటకానికి పెద్దపీట వేసినట్లు తెలిసింది. దేశంలోని పర్యాటకంతోపాటు సరిహద్దును ఆనుకుని ప్రాంతాలకు సైతం భారీగా నిధులు కేటాయించారు.
తాజాగా మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ కేంద్రం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపినట్లు తెలిసింది. బడ్జెట్‌లో కేంద్రం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది.
ఈ కేటాయింపు గతేడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువగా ఉంది. గత బడ్జెట్‌లో ఆ దేశ అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన దాంతో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు 22 శాతం తగ్గాయి. దేశం అవలంబిస్తున్న ‘పొరుగుకే పాధాన్యం’ అనే విధానంలో భాగంగా ఈ బడ్జెట్‌లో కింది విధంగా నిధులు కేటాయించింది.
- భూటాన్ అభివృద్ధికి రూ.2,068 కోట్లు
- మాల్దీవులకు రూ.600 కోట్లు
- నేపాల్‌కు రూ.700 కోట్లు
- అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు
- బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ఇస్తున్నట్లు చెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.22,154 కోట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment