ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' నిన్న (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈమె కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం నాటి బడ్జెట్ సెషన్ ప్రసంగం సీతారామన్ తన కెరీర్‌లో చేసిన అతి చిన్న ప్రసంగం కావడం గమనార్హం.
నిర్మలా సీతారామన్ ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా 2020లో 160 నిముషాలు (2 గంటల 40 నిమిషాలు), అత్యల్పంగా 2024 మధ్యంతర బడ్జెట్ 56 నిముషాలు. 2019లో ఈమె బడ్జెట్ ప్రసంగం 140 నిముషాలు, 2021లో 100 నిముషాలు, 2022లో 91 నిముషాలు, 2023లో 87 నిమిషాల ప్రసంగం చేశారు.
బడ్జెట్ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు.
ఇదీ చదవండి: అందరికీ ఇళ్ళు - వచ్చే ఐదేళ్లలో 2 కోట్లు..
నిర్మలా సీతారామన్ కంటే ముందు 1977లో కేంద్ర బడ్జెట్ సమర్పించిన 'హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్' అతి తక్కువ బడ్జెట్ ప్రసంగంగా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పదాల లెక్కన అత్యంత సుదీర్ఘ బడ్జెట్‌ను రూపొందించిన రికార్డు 'మన్మోహన్ సింగ్' పేరిట ఉంది. 1991లో సమర్పించిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment