కేంద్ర బడ్జెట్ 2024 పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా చూడాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న యూనియన్ బడ్జెట్‌లో సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని పెంచాలని అంటున్నారు. ఈ మినహాయింపులను చివరిసారిగా 2014-2015 బడ్జెట్‌లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు సవరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈసారైనా మినహాయింపు స్లాబ్‌ను పెంచుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సెక్షన్ 80C అనేది ఆదాయపు పన్ను చట్టంలో కీలకమైంది. సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వేతనజీవులు స్వల్ప, దీర్ఘకాల పెట్టుబడులు, ఖర్చుల కోసం పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు.
సెక్షన్ 80C కింద క్లెయిమ్ అవుతున్న కొన్ని పెట్టుబడులు:
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
- ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)
- యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)
- ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)
- జీవిత బీమా ప్రీమియంలు
- సుకన్య సమృద్ధి యోజన
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..
పరిమితిని ఎందుకు పెంచాలంటే..
సెక్షన్ 80C కింద మినహాయింపుల కోసం రూ.1.5లక్షల పరిమితి తొమ్మిదేళ్లుగా అలాగే ఉంది. దీన్ని చివరిగా 2014-15లో సవరించారు. అప్పటినుంచి ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణించి సవరణలు చేయాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ పరిమితిలో ఎక్కువ భాగం ప్రావిడెంట్ ఫండ్‌కే కేటాయించబడుతుందని కొందరు తెలుపుతున్నారు. ఒకవేళ హౌసింగ్ లోన్ ఉంటే అసలు కట్టేందుకే ఈ పరిమితి సరిపోవడంలేదని చెబుతున్నారు. దీన్ని కనీసం రూ.2,50,000కి పెంచాలని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment