
మధ్యంతర బడ్జెట్ 2024-25 సమర్పణకు వెళ్లే ముందు భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెరుగు తినిపించారు.
2024-25 ముందస్తు ఎన్నికల బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పించేందుకు అనుమతి తీసుకుంటారు. అందులో భాగంగానే మంత్రి రాష్ట్రపతిని కలిశారు. ముర్ము నిర్మలమ్మకు పెరుగు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.