ఢిల్లీ: కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం జూలై మధ్యలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 2024-25 బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వివిధ శాఖల మంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలను జూన్ 17 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్రం లేవలం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక.. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment