కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఎకనామిక్‌టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు.
సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలుపొందిన నరేంద్రమోదీ పరివారానికి ఇప్పటికే మంత్రిత్వశాఖలు కేటాయించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా తిరిగి నిర్మలాసీతారామన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే 6 సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డులకెక్కారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో 5 పూర్తికాల కేంద్ర పద్దులు చదివినట్లైంది. బడ్జెట్ తేదీపై వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జులైలో నిర్మలమ్మ కేంద్ర పద్దులు ప్రవేశపెడితే ఏకంగా వరుసగా 7 సార్లు బడ్జెట్ విడుదల చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తారు.
ఇదీ చదవండి: మనిషికో రోబో!
ఈసారి బడ్జెట్‌లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ రంగంలోని సవాళ్లను పరిష్కరించడం, ఉపాధిని సృష్టించడం, రాబడి వృద్ధిని పెంచడం వంటి ప్రాథమిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రబడ్జెట్‌కు సంబంధించి జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment