Union Budget 2024: ట్యాక్స్‌ పేయర్స్‌కు నిరాశే.. | FM Nirmala Sitharaman Budget 2024 Highlights: No Change In Income Tax Rate, Tax Rates Will Remain Unchanged - Sakshi
Sakshi News home page

Union Budget 2024 Highlights: ట్యాక్స్‌ పేయర్స్‌కు నిరాశే..

Published Thu, Feb 1 2024 12:16 PM | Last Updated on Thu, Feb 1 2024 4:58 PM

Budget 2024 No tax rate changes - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  పార్లమెంట్‌లో  ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్‌ ట్యాక్స్‌ పేయర్స్‌ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి  ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా ఉంటాయి. 

ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి రూ. 7 లక్షలు ఉంది. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని రూ.8 లక్షలకు పెంచుతారని భావించారు. కానీ ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో నిరాశే మిగిల్చింది.

ఇక పన్ను శ్లాబులకు విషయానికి వస్తే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 5 పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇవి గతంలో  ఆరు శ్లాబులు ఉండగా గతేడాది ఐదుకు తగ్గించారు. 

అలాగే పన్ను రేట్లను కూడా గతేడాది గణనీయంగా తగ్గించారు.  రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. అయితే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో పన్నుచెల్లింపుదారులకు ఎటువంటి ఊరటలను కేంద్రం ప్రకటించకపోవడంతో నిరాశ తప్పలేదు. 

కాస్త ఊరట.. పన్ను బకాయిల రద్దు

పన్ను రేట్ల విషయంలో నిరాశ పరిచినప్పటికీ పాత ప​న్ను బకాయిలు రద్దు చేస్తూ ఈ బడ్జెట్‌ కాస్త ఊరటనిచ్చింది. 2009-10 కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.25,000, అలాగే 2014-15కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.10,000 వరకూ రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement