కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోవపోవడంతో సామాన్యులు, ట్యాక్స్ చెల్లింపుదారులు కొంత నిరాశ చెందినట్లు తెలిసింది. అయితే మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలపై ఆధారపడకుండా సాధికారతపై దృష్టి పెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రముఖ మీడయా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆదాయం పన్ను స్లాబ్‌ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. అయినా ఏప్రిల్ / మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటిస్తారని, తమ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం
ద్రవ్య క్రమశిక్షణ, సబ్సిడీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ సాంఘిక సంక్షేమానికి పెద్దగా నిధుల కేటాయించక పోవడంపై ఎటువంటి ఆందోళన లేదని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నా పేదలందరికీ ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసిందని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment