tax slabs
-
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
కొత్త ట్యాక్స్ విధానంలో మార్పులపై నిర్మలా సీతారామన్ జవాబు
-
పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోవపోవడంతో సామాన్యులు, ట్యాక్స్ చెల్లింపుదారులు కొంత నిరాశ చెందినట్లు తెలిసింది. అయితే మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలపై ఆధారపడకుండా సాధికారతపై దృష్టి పెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రముఖ మీడయా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆదాయం పన్ను స్లాబ్‌ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. అయినా ఏప్రిల్ / మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటిస్తారని, తమ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం ద్రవ్య క్రమశిక్షణ, సబ్సిడీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ సాంఘిక సంక్షేమానికి పెద్దగా నిధుల కేటాయించక పోవడంపై ఎటువంటి ఆందోళన లేదని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నా పేదలందరికీ ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసిందని ఆమె వివరించారు. -
పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పన్నుదారులకు ఊరట లభిస్తుందా..?
ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే పన్నుభారం అధికమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్నుదారులకు కొంత వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. దేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4-8 శాతంగా నమోదవుతోంది. దాంతో వస్తున్న సంపాదనలో గరిష్ఠంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా పన్ను చెల్లింపుదారులకు మరింత నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. అధిక జీతాలున్న వారికి పన్నుస్లాబ్లు పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల థ్రెషోల్డ్‌ను రూ.20 లక్షలకు పెంచడం వల్ల కొంత ద్రవ్యోల్బణంతో పాటు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2020 కింద కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా పన్నుస్లాబ్లు 5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వార్షికంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రూ.20లక్షల స్లాబ్‌కు మార్చాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నారు. ఏటా స్టాండర్డ్ డిడక్షన్‌లో భాగంగా ఉన్న రూ.50,000 స్లాబ్‌ను రూ.1లక్షకు పెంచాలని కొందరు కోరుతున్నారు. -
ట్యాక్స్స్లాబ్లు సవరిస్తారా..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్‌ల్లో భారీ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణుల అంచనా. అందులో భాగంగా ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వొచ్చని, టీడీఎస్‌ను మరింత సులభతరం చేయొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింతగా ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం బేసిక్ ట్యాక్స్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతుందని అంచనా. అంతేకాకుండా ట్యాక్స్ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ట్యాక్స్ డిడక్షన్లు, మినహాయింపులు లేవు కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇన్ఫ్లేషన్ పెరగడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వొచ్చు. ఉద్యోగస్థులు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో వీటిని ట్యాక్స్ మినహాయింపుగా వాడుకోవడానికి వీలుంది. కొత్త సిస్టమ్‌లో ఈ సౌకర్యం లేదు. అందువలన హెల్త్ కేర్, రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవడానికి కొత్త సిస్టమ్‌లోని ట్యాక్స్ శ్లాబ్‌లను సవరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
Union Budget 2023-24: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 5 కి తగ్గింపు 0-3 లక్షల వరకు పన్నులేదు రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఊరట కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బడ్జెట్ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? మీరేం అనుకుంటున్నారు?
‘బడ్జెట్ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’ ‘బడ్జెట్ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది. సివిల్స్ కలలు కనే వారి నుంచి స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు... కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్ కలలు కనే యంగ్‌స్టర్స్‌కు బడ్జెట్ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్ అంటే ఏమిటి? అసలు బడ్జెట్ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్‌లో సివిల్స్ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్‌లో సక్సెస్ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్‌కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక. యంగ్పీపుల్ బడ్జెట్ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో సివిల్స్‌లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు. ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్‌పై ఆసక్తి కలిగేలా చేస్తుంది. కంపెనీల లే ఆఫ్‌లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి సక్సెస్ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్‌పై ఒక కన్ను వేస్తున్నారు. దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్‌కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్–టర్మ్ సేవింగ్ కల్చర్‌ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్ ప్రసంగం వినాల్సిందే. సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వింటున్నారు. తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్‌పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్. ‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్‌ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష. ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్ యూనివర్శిటీ. ‘డిజిటల్ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్లో డిజిటల్ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్‌కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష. ‘బడ్జెట్’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా! స్టార్టప్ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్ ప్రసంగం వినడం అనివార్యం అయింది. -
కేంద్ర బడ్జెట్ 2023: నిర్మలమ్మ ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశాలు ఇవేనా!
Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 1 ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్న బడ్జెట్‌ను పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనాకర్షన బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక కేటాయింపులు విషయానికొస్తే.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసే అవకాశమూ ఉంది. కోవిడ్ తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయపు పన్ను స్లాబు విషయంలో గత 9 ఏళ్లుగా మార్పులు లేకుండా అలానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేతన జీవులను నిర్మలమ్మా కరుణిస్తుందనే అంటున్నారు. కాకపోతే ఈసారి కూడా భారీ వెసులుబాటు ఉండకపోవచ్చు కానీ.. కొద్దో గొప్పో మార్పులు ఉండే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కనీస మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాలన్నా ఉద్యోగుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ మౌలిక సదుపాయల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కొలువుల కోతలు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలు ఉన్నాయంటూన్నారు. వీటితో పాటుగా గృహరుణాలు. ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసలుబాటు కల్పించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. రైల్వే శాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం పెంపు ఉండచ్చని తెలుస్తోంది. ఇక బంగారం దిగుమతులపై పన్ను తగ్గించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశం కనిపిస్తోంది. -
బడ్జెట్ 2023: కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023-24ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో ప్రజలకు కొంత ఉపశమనాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన కేటాయింపులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయనుంది, ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చని అటు ప్రజలతో పాటు నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం! పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ₹ 2.5 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ నిబంధనలో గత ఏడేళ్లగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీంతో రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం ₹ 5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుంచి ₹ 1 లక్ష వరకు రెట్టింపు చేసే అవకాశం ఉందని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ తెలిపింది. ఆండ్రూ టిల్టన్, శాంతాను సేన్‌గుప్తాతో సహా గోల్డ్‌మ్యాన్ ఆర్థికవేత్తలు భారతదేశం తన లోటును 5.9కి ఉంచుతుందని ఒక నివేదికలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, సామాజిక పథకాల వ్యయం ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాలపై ఖర్చు కూడా పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే రానున్న కాలంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్ ఇదే కావడంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక రంగ సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
నిస్సారమైన బడ్జెట్: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా చప్పగా, నిస్సారంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో ఏమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే.. మాటలే తప్ప చేతలు చేతకాని ప్రభుత్వమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పన్ను శ్లాబుల్లో గారడీ చేశారని, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అసలైన పరిష్కార మార్గాలు చూపలేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ బడ్జెట్లో యువతకు ఉద్యోగం కల్పించేందుకు ఎలాంటి వాస్తవికత, వ్యూహాత్మకమైన భావన ఏమీ కన్పించట్లేదు’అని పేర్కొన్నారు. ‘ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెబుతున్నట్లు.. కొత్త సీసాలో పాత సారాయి పోసినట్లు ఉంది’అని ఆరోపించారు. ‘చాలా ఎక్కువ సేపు చదివిన బడ్జెట్ మాత్రమే కాదు.. అత్యంత నిస్తేజమైన బడ్జెట్ ఇది’అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎద్దేవా చేశారు. ‘అచ్ఛే దిన్’ను కేంద్రం ఎలా వదిలిపెట్టిందో.. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూడా గాలికొదిలేసిందని ట్విట్టర్లో దుయ్యబట్టారు. పన్ను చెల్లింపుదారులను ఆరేళ్లుగా పీడించుకుని తిన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన విషయాన్ని ఇప్పుడు గుర్తించినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు బడ్జెట్ మొత్తంలో ఉద్యోగాల గురించి ఎక్కడా ఒక్క పదం కూడా లేకపోవడం గర్హనీయమని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. -
జీఎస్టీ కౌన్సిల్ భేటీ : వీటి ధరలు తగ్గే ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు రెండు వారాల ముందు శుక్రవారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్నారు. నిర్మాణ, ఆటోమొబైల్ రంగాలకు ఊతమిచ్చేలా ఆటోమొబైల్, సిమెంట్ రంగాలపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కారణంగా ఆటో పరిశ్రమకు జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదేతరహాలో సిమెంట్ పరిశ్రమ సైతం జీఎస్టీ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్య ప్రస్తుతం నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెస్తుందని భావిస్తున్నారు. కాగా సిమెంట్ రంగంపై పన్ను రేట్లను 18 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ 12,000 నుంచి రూ 14000 కోట్ల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారీ కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేందుకు రూ 50 కోట్ల పైబడిన లావాదేవీలకు ఈ-ఇన్వాయిసింగ్ను తప్పనిసరి చేయడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రస్తుతం అత్యధికంగా 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న పలు వస్తువులు, సేవలను తక్కువ పన్ను శ్లాబ్‌ల్లోకి తీసుకురావడంపైనా ప్రధానంగా చర్చించనున్నారు. -
18నెలల పసిబాలపై అజ్ఞానంతో విమర్శలు
సాక్షి న్యూఢిల్లీ: భవిష్యత్‌లో జీఎస్టీ వ్యవస్థను మరింత సరళతరం చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్టీ తెలిపారు. రానున్న కాలంలో దేశంలో మూడే జీఎస్టీ రేట్లు ఉంటాయని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జీఎస్టీలో అత్యధిక పన్ను శ్లాబు అయిన 28శాతాన్ని క్రమంగా తొలగిస్తామని, 12, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 18నెలల జీఎస్టీ (Eighteen Months of GST) పేరుతో జైట్లీ తన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. 2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది ఇంకా 18నెలలు కూడా నిండని జీఎస్టీపై అసంపూర్ణ సమాచారంతో తీవ్ర విమర్శలు, ఉద్దేశ పూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ వ్యవస్థ అమలు అసలు ప్రభావం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్బంగా జీఎస్టీ అమలుకు ముందు ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత ఘోరమైన పరోక్ష పరోక్ష పన్ను వ్యవస్థ దేశంలో ఉండేదని వ్యాఖ్యానించారు. కానీ తమ హాయాంలో జీఎస్టీ అమల్లోకి అమల్లోకి వచ్చిన తర్వాత 31శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28శాతం శ్లాబులో చేర్చామని తెలిపారు. సామాన్యులు వినియోగించే ఎన్నో నిత్యావసర వస్తువులపై జీరో, లేదా 5శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. అలాగే అంతకుముందు 35-110శాతం ఉన్న సినిమా టికెట్లను 12-18 శాతం కిందకు తీసుకొచ్చాం. అలాగే సిమెంట్, ఆటోపార్ట్స్‌పై మాత్రమే ప్రస్తుతం 28శాతం ఉందని, భవిష్యత్‌లో వీటిని తక్కువ పన్ను పరిధిలోకి తీసుకొస్తామని జైట్లీ వెల్లడించారు. జీఎస్టీకి ముందు చాలా వస్తువులపై 31శాతం అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవి. దీనివల్ల పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేది. సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన వస్తువులు, సిమెంటు, డిష్వాషర్లు, ఏసీలు, పెద్దపెద్ద టీవీలపై మాత్రమే 28శాతం పన్ను ఉంది. నిత్యం వినియోగించే 1216 వస్తువుల్లో.. 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. 5శాతం శ్లాబులో 308, 12శాతం శ్లాబులో 178, 18శాతం శ్లాబులో 517 వస్తువులున్నాయి. 28శాతం శ్లాబు క్రమంగా పూర్తిగా తొలగిపోతుంది.12శాతం, 18శాతం శ్లాబులు కాకుండా వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. ఆ రేటు 12, 18శాతాలకు మధ్యస్తంగా ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టొచ్చు. పన్ను చెల్లింపులు పెరిగిన దాని ప్రకారంగా ఈ పన్ను రేటును తీసుకొస్తాం. ఇకపై జీఎస్టీలో సున్నా, 5శాతం, ప్రామాణిక పన్ను రేటు మాత్రమే ఉంటాయఅని జైట్లీ తెలిపారు. ఫెడరల్ వ్యవస్థలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా జీఎస్టీని అమలు చేస్తున్నాం. ఇప్పటివరకూ 31 జీఎస్టీమండలి సమావేశాలు నిర్వహించుకున్నాం. వేలాది నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నామంటూ రాసుకొచ్చారు. కాగా 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 99శాతం వస్తువులను 18శాతం అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా 31వ జీఎస్టీ సమావేశంలో పన్ను రేట్లలో పలుమార్పులకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 28శాతం జీఎస్టీ రేటు వున్న వస్తువులలో కొన్నింటిని 18శాతం, 5శాతం శ్లాబులకుమార్చింది. అయితే సినిమా టికెట్లపై జీఎస్టీ రేటును తగ్గించిన కేంద్రం, సిమెంట్‌ను మాత్రం 28 శాతం శ్లాబులోనే ఉంచడంపై విమర్శలు చెలరేగాయి. -
40 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు
-
గుడ్‌న్యూస్ : జీఎస్టీ రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో పన్ను రేటు తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. 33 అంశాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటులను తగ్గించింది. 28శాతం జీఎస్టీ ఉన్న సుమారు ఏడింటిని 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. అలాగే మరో 26 వస్తువులను 18శాతం శ్లాబు నుంచి 12శాతం, 5శాతం శ్లాబులకు మార్చాలని నిర్ణయించారు. 28 విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్టీ వసూలు యథాతథంగా ఉంటుంది. అయితే సిమెంట్‌పై జీఎస్టీ 18 శాతానికి కోతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారికి నిరాశే మిగిలింది. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించేందుకు కౌన్సిల్ నిర్ణయించిందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ముఖ్యంగా టీవీలు కంప్యూటర్లు, ఆటో పార్ట్స్ తదితరాల ధరలు దిగి రానున్నాయని ఉత్తరాఖండ్ ఆర్తికమంత్రి ప్రకాశ్ పంత్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. అనంతరం జైట్లీ సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వివరాలను ప్రకటించారు. వందలాది వస్తువులపై జీఎస్టీ కోత -జైట్లీ వందలకొద్దీ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించామని అని అరుణ్ జైట్లీ చెప్పారు 28శాతం జీఎస్టీ వసూలు చేసే 34 స్తువుల నుంచి ఆరు అంశాలను తొలగించినట్టు చెప్పారు. మూడు వస్తువులపై జీఎస్టీని 18శాతంనుంచి 12శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని, తగ్గించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని జైట్లీ వెల్లడించారు. అలాగే సాధారణ పొదుపు ఖాతాలు, జనధన్ సేవింగ్స్ బ్యాంక్స్ ఖాతాలపై బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి జీఎస్టీ వుండదని పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్రీకృత అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఏర్పాటునకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని అరుణ్ జైట్లీ ప్రకటించారు.ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఆర్థికమంత్రి తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, 32 అంగుళాల టీవీలు, టైర్లు, లిథియం బ్యాటరీల పవర్ బ్యాంక్స్ 18శ్లాబులోకి దివ్యాంగులకు సంబంధించిన పలు ఉత్పత్తులపై 18నుంచి అతితక్కువగా 5శాతానికి తగ్గింపు వంద రూపాయిలలోపు వున్న సినిమా టికెట్లపై 18 శాతంనుంచి 12శాతానికి రూ.100 పైన ఉన్న టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు థర్డ్ పార్ట్ ఇన్సూరెన్స్‌పై వసూలు చేసే జీఎస్టీ18 -12 శాతానికి తగ్గింపు తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు సంబంధించిన ప్రత్యేక విమానాలపై ప్రీమియం పన్ను వసూలు ఉండదు. ఎకానమీ 5, బిజినెస్ 12శాతం వుంటుంది. జనవరిలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. -
నిత్యావసరాల ధరలు దిగి రానున్నాయా?
సాక్షి,న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని మరింత సరళం చేయనున్నామని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హింట్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రసంగించిన మోదీ సామాన్యులు వినియోగించే దాదాపు అన్ని వస్తువులను 18 శాతం, లేదా దాని కంటే తక్కువ శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురానున్నామని చెప్పారు. 99 శాతం వస్తువులను 18శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. అలాగే ప్రస్తుత 2 శాతం జీఎస్టీ శ్లాబులో కొన్ని లగ్జరీ వస్తువులను మాత్రమే పరిమితం చేస్తామని ప్రధాని తెలిపారు. జీఎస్టీ ప్రారంభానికి ముందు దేశంలో 65 లక్షల రిజిస్టర్ అయిన వ్యాపారస్తులు ఉండగా, ఇప్పుడు 55 లక్షలమంది అదనంగా రిజిస్టర్ అయ్యారని ప్రధాని తెలిపారు. దేశంలో అతి చిన్న పన్ను సంస్కరణలు చేపట్టడం కూడా చాలా సంక్లిష్టమైన అంశంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతిని రూపుమాపడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశంలో అవినీతి పట్ల తేలిగ్గా స్పందిస్తున్నారని, ఆ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నాటికి దేశంలోని 55 శాతం గృహాలు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నాయని అయితే తమ హయాంలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వివరించారు. అలాగే దశాబ్దల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందపి ఆయన చెప్పారు. కొత్త భారతదేశం నిర్మించే దిశగా తాము సాగుతున్నామన్నారు. జీఎస్టీ విధానాన్ని సరళీకరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నిలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ నేపథ్యంలో 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకొస్తామని ప్రధాని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
మధ్యతరగతి ప్రజలకు అతిపెద్ద ఊరట
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో అతిపెద్ద ఊరట కల్పించబోతుంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థికమంత్రిత్వ శాఖ పెంచబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాక, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.2,50,000గా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3,00,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకొచ్చినట్టు పేర్కొన్నాయి. పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిస్తూ.. వార్షిక ఆదాయం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని చూస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్ పరిమితిని, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..
-
జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..
దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 90 శాతం వస్తువులు అంటే 1205 వస్తువులను వివిధ రకాల పన్ను శ్లాబ్స్ లోకి తీసుకొచ్చేసింది. ఇక మిగిలి ఉన్న ఆరు వస్తువులు, సేవలపై పన్ను రేట్లను నిర్ణయించేందుకు నేడు కూడా జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. జనాలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువులు ముందస్తుగా కంటే ప్రస్తుతం పన్ను రేట్లను తగ్గించారు. ఈ నేపథ్యంలో ఏయే వస్తువులు ఏయే రేట్ల పరిధిలోకి వస్తాయో ఓ సారి చూడండి... పన్ను లేని వస్తువులు.. తాజా మాంసం, తాజా చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, పిండ్లు, ఉప్పు, బ్రెడ్, బిందీ, సిందూర్, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు. 5 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి.... ఫిష్ పిల్లెట్, క్రీమ్, స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్, బ్రాండెడ్ పన్నీర్, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, టీ, స్పైసీస్, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, కిరోసిన్, కోల్, మెడిసిన్స్, స్టెంట్, లైఫ్ బోట్స్ 12 శాతం శ్లాబ్ లోకి వచ్చే వస్తువులు... నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్, సాసేజ్, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్(చిప్స్ లాంటివి), ఆయుర్వేదిక్ మెడిసిన్లు, టూత్ ఫౌడర్, అగర్ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు. 18 శాతం పరిధిలోకి వచ్చేవి... ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్విలాప్స్, టాంపోన్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, కెమెరా, స్పీకర్స్, మానిటర్స్. 28 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి... చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పేయింట్, ఫర్ ప్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ఏటీఎంలు, వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్.