కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..
కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఇది వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుంది.
కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణ
- రూ.0-4 లక్షలు - సున్నా
- రూ.4-8 లక్షలు - 5%
- రూ.8-12 లక్షలు - 10%
- రూ.12-16 లక్షలు - 15%
- రూ.16-20 లక్షలు - 20%
- రూ.20-24 లక్షలు - 25%
- రూ.24 లక్షల పైన 30 శాతం
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు.
- నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు.
- స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment