ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్‌ల్లో భారీ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణుల అంచనా. అందులో భాగంగా ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వొచ్చని, టీడీఎస్‌ను మరింత సులభతరం చేయొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.
కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింతగా ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం బేసిక్ ట్యాక్స్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతుందని అంచనా. అంతేకాకుండా ట్యాక్స్ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ట్యాక్స్ డిడక్షన్లు, మినహాయింపులు లేవు కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ఇన్‌ఫ్లేషన్ పెరగడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వొచ్చు. ఉద్యోగస్థులు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో వీటిని ట్యాక్స్ మినహాయింపుగా వాడుకోవడానికి వీలుంది. కొత్త సిస్టమ్‌లో ఈ సౌకర్యం లేదు. అందువలన హెల్త్ కేర్, రిటైర్‌మెంట్ కోసం పొదుపు చేసుకోవడానికి కొత్త సిస్టమ్‌లోని ట్యాక్స్ శ్లాబ్‌లను సవరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment