న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది.
ట్యాక్స్ స్లాబ్స్ 6 నుంచి 5 కి తగ్గింపు
0-3 లక్షల వరకు పన్నులేదు
రూ. 3 - 6 లక్షల వరకు 5% పన్ను
రూ. 6 - 9 లక్షల వరకు 10% పన్ను
రూ. 9 -12 లక్షల వరకు 15% పన్ను
రూ. 12- 15 లక్షల వరకు 20% పన్ను
రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను
దీని ప్రకారం ఆదాయం రూ. 7లక్షలు దాటితే 3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలుగా ట్యాక్స్ ఉండనుంది. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల సగటు ప్రాసెసింగ్ సమయాన్ని 93 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు.
సీనియర్ సిటిజన్లకు ఊరట
కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్లకు ఊరట ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. అలాగే సేవింగ్ అకౌంట్ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. ఇక ఇప్పటివరకు ఉన్న 80సి కింద మినహాయింపులు చూపించుకోవాలంటే పాత పన్ను పద్ధతిని ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment