ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే పన్నుభారం అధికమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్నుదారులకు కొంత వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు.
దేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4-8 శాతంగా నమోదవుతోంది. దాంతో వస్తున్న సంపాదనలో గరిష్ఠంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా పన్ను చెల్లింపుదారులకు మరింత నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. అధిక జీతాలున్న వారికి పన్నుస్లాబ్‌లు పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల థ్రెషోల్డ్‌ను రూ.20 లక్షలకు పెంచడం వల్ల కొంత ద్రవ్యోల్బణంతో పాటు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2020 కింద కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా పన్నుస్లాబ్‌లు 5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వార్షికంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రూ.20లక్షల స్లాబ్‌కు మార్చాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నారు. ఏటా స్టాండర్డ్ డిడక్షన్‌లో భాగంగా ఉన్న రూ.50,000 స్లాబ్‌ను రూ.1లక్షకు పెంచాలని కొందరు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment