జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు.. | A quick guide to India GST rates in 2017 | Sakshi
Sakshi News home page

జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..

Published Fri, May 19 2017 2:24 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..

జీఎస్టీ వేటిపై ఎంత? ఇదిగో లిస్టు..

దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 90 శాతం వస్తువులు అంటే 1205 వస్తువులను వివిధ రకాల పన్ను శ్లాబ్స్ లోకి తీసుకొచ్చేసింది. ఇక మిగిలి ఉన్న ఆరు వస్తువులు, సేవలపై పన్ను రేట్లను నిర్ణయించేందుకు నేడు కూడా జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. జ‌నాలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువులు ముందస్తుగా కంటే ప్రస్తుతం పన్ను రేట్లను తగ్గించారు. ఈ నేపథ్యంలో  ఏయే వస్తువులు ఏయే రేట్ల పరిధిలోకి వస్తాయో ఓ సారి చూడండి...
 
పన్ను లేని వస్తువులు..
తాజా మాంసం, తాజా చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, పిండ్లు, ఉప్పు, బ్రెడ్, బిందీ, సిందూర్, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు.
 
5 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి....
ఫిష్ పిల్లెట్, క్రీమ్, స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్, బ్రాండెడ్ పన్నీర్, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, టీ, స్పైసీస్, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, కిరోసిన్, కోల్, మెడిసిన్స్, స్టెంట్, లైఫ్‌ బోట్స్
 
12 శాతం శ్లాబ్ లోకి వచ్చే వస్తువులు...
నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్, సాసేజ్, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్(చిప్స్ లాంటివి), ఆయుర్వేదిక్ మెడిసిన్లు, టూత్ ఫౌడర్, అగర్ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు.
 
18 శాతం పరిధిలోకి వచ్చేవి...
ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్విలాప్స్, టాంపోన్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, కెమెరా, స్పీకర్స్, మానిటర్స్. 
 
28 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి...
చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పేయింట్, ఫర్ ప్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ఏటీఎంలు, వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement