కేంద్ర ప్రభుత్వానికి ఏటా భారీ డివిడెండ్ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొస్తునే ఉంటుంది. తమ వద్ద ఉన్న మిగులు నిధుల నుంచి రూ.87,416 కోట్లు డివిడెండ్‌గా చెల్లించేందుకు ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బృందం గతేడాది మే నెలలో ఆమోదం తెలిపింది. 2022తో పోలిస్తే ఈ మొత్తం మూడింతలు అధికం కావడం గమనార్హం.
2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్‌బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల (బ్యాంకుల) నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ రానుందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. ఇది కిందటేడాది బడ్జెట్‌లో వేసిన అంచనా రూ.48 వేల కోట్ల కంటే చాలా ఎక్కువ.
కేంద్ర సంస్థల నుంచి భారీ డివిడెండ్..
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ)ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల డివిడెండ్ ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల నుంచి రూ.39,961 కోట్ల డివిడెండ్‌ను కేంద్రం అందుకుంది.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్‌బీఐ, ప్రభుత్వ బ్యాంకులు, ఇతర గవర్నమెంట్ కంపెనీల నుంచి కేంద్రానికి రూ.1,54,407 కోట్ల డివిడెండ్ ఆదాయం రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ మొత్తం డివిడెండ్ రూ.1.50 లక్షల కోట్లు అందుతుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment