దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రూ.100లక్షల కోట్ల విలువతో ఈ కార్యక్రమాన్ని గతంలో రూపొందించిన విషయం తెలిసిందే.
మల్టీమోడల్ కనెక్టివిటీతో చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి చెప్పారు. రైల్‌కారిడార్‌లో ప్రధానంగా ఎనర్జీ, మినరల్, పోర్ట్‌కనెక్టవిటీ, హైట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో సమర్థంగా రైళ్లను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లాజిస్టిక్ ఎఫిషియన్సీ, రెడ్యూసింగ్ కాస్ట్, వేగాన్ని పెంచేలా ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
పీఎం గతిశక్తి పథకంతో 25ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు గతంలోనే మోదీ చెప్పారు. దాదాపు 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా రానున్న రోజుల్లో దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment