ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో పన్ను మినహాయింపులు పెంచుతారని పన్నుదారులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఎక్కువ మంది ఆయా ప్లాన్‌ల్లో అధికంగా కేటాయింపులు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయానికి పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో పెడుతున్న పెట్టుబడి చాలా కీలకంగా మారనుంది.
ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు సెక్షన్ 80సీ కింద ఇస్తున్న రూ.50,000 పన్ను మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. దాంతోపాటు పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌లకు సైతం ఈ మినహాయింపును వర్తింపజేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ఆ ప్లాన్‌ల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో జీరో రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే వస్తున్న రాబడులపై ట్యాక్స్ భారాన్ని తగ్గించడంలో సహాయపడాలని అంటున్నారు. ఫలితంగా మరింత ఆర్థికభద్రత పెరుగుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
ప్రస్తుతం సెక్షన్ 80సీ పరిధిలోకి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకం, ఈఎల్‌ఎస్‌ఎస్ మొదలైన ఇతర పన్ను ఆదా ఉత్పత్తులు వస్తున్నాయి. సెక్షన్ 80డీ కింద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే వీటిలో ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచాలని కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment