సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేస్తున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.
గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేయనున్నారు.
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ వరుసగా ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు.
2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించిన మహిళా ఆర్థికమంత్రి సీతారామన్. ఈ వారంలో ఆరవసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
వరుసగా ఐదు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్. గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా ఐదుసార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఆరో బడ్జెట్‌తో కొత్త రికార్డు నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్.
Comments
Please login to add a commentAdd a comment