ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్లే కాదు.. ప్రత్యేకరోజున ఆవిడ కడుతున్న చీరలు అందరిలో ఆసక్తి కలిగిస్తున్నాయి.
టెంపుల్ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అందరినీ ఆకట్టుకున్న ఎరుపు రంగు చేనేత చీర గుర్తుందా.. ఆ ఇల్‌కల్ చేనేత చీరను నవల గుంద కసూతితో రూపొందించిన విషయ తెలిసిందే.
తాజాగా 2024-25 బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టస్సర్ హ్యాండ్లూమ్ బ్లూ, క్రీమ్ రంగు చీరను ఎంచుకున్నారు. మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్‌ను సమర్పించనున్న నిర్మలమ్మ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు సీనియర్ అధికారులతో సంప్రదాయ బహీ ఖాతా ట్యాబ్లెట్‌తో దర్శనమిచ్చారు.
గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం..
►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది.
►పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర..
►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది
►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్‌పురి చీర
► గతంలో మన్మోహన్ సింగ్‌ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర
►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ధరించారు.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman will present the interim budget today pic.twitter.com/irGtbAcPbP
— ANI (@ANI) February 1, 2024
Comments
Please login to add a commentAdd a comment