![Budget Not Announced By These Finance Ministers In India - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/25/budget2501.jpg.webp?itok=6a4BEp4L)
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషం. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్‌లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం!
‘బడ్జెట్’ పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్‌ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టని జాబితాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు.
ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే..
హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలంపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం రాలేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment