కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పేదలు, మహిళలు, యువత, రైతుల పరిస్థితులను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024లో కీలకమైన అంశాలు
- ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది.
- ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది.
- పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి.
- ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది.
- పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు.
- వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
- 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు.
- రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్‌ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
- అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.
- స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లక్షపతి దీదీ'లుగా మారేందుకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు.
- ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు
- స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్‌లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి.
- దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment