రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేసింది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటు ద్వారా కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
గ్రీన్ గ్రోత్ , పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటివరకు 1.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు, 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సంవత్సరానికి రూ. 15,000-18,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. సప్లయి, ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment