ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందుకు తెచ్చారు.
ఈ బడ్జెట్‌లో పన్ను విధానాల్లో మార్పులు చేసి వేతన జీవులకు ఊరట కల్పిస్తారని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలేమీ మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కల్పించలేదు. కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితిని రూ.4లక్షలకు పెంచుతారని భావించారు. కానీ అందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. మిగతా శ్లాబుల్లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. ఇక స్టాండర్ట్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచి స్వల్ప ఊరట కల్పించింది.
ఆదాయపు పన్ను కొత్త స్లాబులు ఇవే
రూ. 3లక్షల వరకు నో ట్యాక్స్
రూ.3 - 7 లక్షలు 5% పన్ను
రూ.7-10 లక్షలు 10%
రూ.10-12 లక్షలు 15%
రూ.12-15 లక్షలు 20%
రూ.15 లక్షలు దాటితే 30% పన్ను
Comments
Please login to add a commentAdd a comment