బడ్జెట్‌: శాఖల వారీగా కేటాయింపులు | 2021-22 Budget allocations ministrywise | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌: శాఖల వారీగా కేటాయింపులు

Published Mon, Feb 1 2021 5:01 PM | Last Updated on Mon, Feb 1 2021 6:45 PM

2021-22 Budget allocations ministrywise - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కాలం తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసింది. బ‌డ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు కేటాయింపులు అత్యధికంగా జరగడం ప్రధాన అంశం. ఇక మొత్తం బడ్జెట్‌ను పరిశీలిస్తే శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో యథావిధిగా అత్య‌ధికంగా ర‌క్ష‌ణ రంగానికి కేటాయింపులు దక్కాయి. దాని తర్వాత వినియోగదారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ. 
(చదవండి: బడ్జెట్‌ 2021: చైనా దూకుడుకు చెక్‌)

రూ.4.78 ల‌క్ష‌ల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. దీనిలో మూల‌ధ‌న వ్య‌యం రూ.1.35 ల‌క్ష‌ల కోట్లు ఉంది. అయితే గ‌తేడాదితో పోలిస్తే మూల‌ధ‌న వ్య‌యం 19 శాతం పెరగడం గమనార్హం. ఈ విషయమై లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్ల‌లో ర‌క్ష‌ణ రంగంలో ఈ స్థాయి మూల ధ‌న వ్య‌యం లేద‌ని తెలిపారు. ఇక అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ: వినియోగదారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు.

  • హోం మంత్రిత్వ శాఖ:  రూ.1,66,547 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు
  • వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు
  • రోడ్డు ర‌వాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు
  • రైల్వేలు: రూ.1,10,055 కోట్లు
  • విద్యా శాఖ : రూ.93,224 కోట్లు
  • ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు
  • గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ : రూ.54,581 కోట్లు
  • కొవిడ్ వ్యాక్సినేష‌న్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించడం విశేషం.
  • స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు
  • ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకానికి తొలి కేటాయింపులు రూ.64,180 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement